విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ


Thu,July 18, 2019 12:46 AM

బీబీనగర్: మండలంలోని కొంమడుగు ప్రాథమికోన్నత పాఠశాల విదార్థులకు మాజీ ఉపసర్పంచ్ కనకబోయిన గోపాల్ బుధవారం నోటుపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారాలను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి టీఆర్‌ఎస్ నాయకులు కనకబోయిన రాజమల్లేశ్, పంజాల శ్రీనివాస్, పొన్న శ్రీనివాస్, నవీన్‌కుమార్ లు పాల్గొన్నారు.

వర్కట్‌పల్లిలో..
వలిగొండ : మండల పరిధిలోని వర్కట్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు స్పైకా లెబొరేటరీ వారి సౌజన్యంతో ఉచితంగా నోటు పుస్తకాలు, షూ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు జయరాజు మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల అభ్యున్నతికి స్పైకా యాజమాన్యం కృషి చేయడం అభినందనీయమన్నారు. స్పైకా జనరల్ మేనజర్ నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మీసాల శేఖర్, ఉప సర్పంచ్ సోలిపురం అరవింద్‌రెడ్డి, స్కూల్ చైర్‌పర్సన్ హంసమ్మ, శ్రీనివాస్, మహేశ్, సైదులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...