దుర్గమ్మ ఆలయంలో చోరీ


Thu,July 18, 2019 12:46 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ : దుర్గమ్మగుడిలో చోరీ జరిగింది. మండలంలోని నాగిరెడ్డిపల్లి ఆవాస గ్రామమైన ఏంబావి గ్రామ సమీపంలోని దుర్గమ్మగుడిలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గమ్మ ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి సమాయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి హుండీ ధ్వంసం చేసి, అమ్మవారి వెండి కళ్లు, కిరీటం, ముక్కుపుడకను అపహరించుకుపోయినట్లు తెలిపారు.

బుధవారం ఉదయం అటువైపుగా వెళ్తున్న గ్రామస్తులు ఆలయ ద్వారాలు తెరిచి ఉండటాన్ని గమనించి లోనికి వెళ్లి చూడగా హుండీ పగులగొట్టి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆలయ పరిసరాలను పరిశీలించి వివరాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై రాఘవేందర్‌గౌడ్ తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...