మున్పిల్ ఎన్నికలు సజావుగా జరుపడానికి సహకరించాలి


Thu,July 18, 2019 12:45 AM

భూదాన్‌పోచంపల్లి: మున్పిల్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బాలశంకర్ కోరారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అన్ని రాజకీయ పక్షాల ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కులాలవారీగా ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేసి కొన్ని సవరణలు చేసి తుది జాబితాను సిద్ధం చేశామన్నారు. ఇక 13 వార్డులకు సంబందించి 26 పోలింగ్ స్టేషన్లను ప్రతిపాదిస్తూ జిబితా తయారు చేశామని తెలిపారు. ఇందులోనూ ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికలు సామరస్య ధోరణిలో జరిగిందేకు ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం మేనేజర్ నల్ల బాలాజీ, డీఎల్‌ఎంటీ ఎస్వీ రామరాజు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గుండు మధు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, సీపీఎం పట్టణ కార్యదర్శి గడ్డం వెంకటేశం, ఆయా పార్టీల నాయకులు కొట్టం కరుణాకర్‌రెడ్డి, బాత్క లింగస్వామి, గుండ్ల రామచంద్రం, రచ్చ సత్యనారాయణ, ముసునూరి యాదగిరి, బొక్క సత్తిరెడ్డి, కొండమడుగు రాజు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...