13 వార్డుల్లో 26 పోలింగ్ స్టేషన్లు


Thu,July 18, 2019 12:44 AM

భూదన్‌పోచంపల్లి: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన అధికారులు బుధవారం 13 వార్డులకు సంబంధించి 26 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తే మార్పులు చేస్తామని ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ బాలశంకర్ తెలిపారు.

వార్డుల వారీగా..
1వ వార్డులో మొత్తం 1064 ఓటర్లుండగా ముక్తాపూర్ ప్రైమరీ స్కూల్, ముక్తాపూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. 2 వార్డులో 1142 ఓటర్లకు ముక్తాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం, రేవణపల్లి గ్రామ పంచాయతీ , 3 వార్డులో 1105 ఓటర్లుకు రేవణపల్లి అంగన్‌వాడీ భవనం, రేవణపల్లి ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ భవనం, 4వ వార్డులో 1082 ఓటర్లు, 5వ వార్డులో 1030 ఓటర్లు, 6వ వార్డులో 1062 ఓటర్లకుగాను పోచంపల్లి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఒక్కో వార్డుకు రెండు చొప్పున మొత్తం 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7వ వార్డులో 1027 ఓటర్లు, 8వ వార్డులో 1053 ఓటర్లున, 9వ వార్డులో 1129 మంది ఓటర్లుండగా.. పోచంపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఒక్కో వార్డుకు రెండు చొప్పున ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10వ వార్డులో 1040 ఓట్లకు గాను నారాయణగిరి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, సీతాణిగూడెం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్‌లో, 11వ వార్డులో 1168 ఓటర్లు, 12వ వార్డులో 1091 ఓటర్లుండగా పోచంపల్లి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్‌లో నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 13వ వార్డులో 1124 ఓటర్లకు గాను పోచంపల్లి జిల్లా పరిషత్ బాలికల పాఠశాల కొత్త భవనంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...