ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి


Thu,July 18, 2019 12:44 AM

బొమ్మలరామారం : వర్షాభావ పరిస్థితుల కారణంగా మండల రైతులకు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయాధికారులు కృషి చేయాలని ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

ఖరీఫ్ 2019కి సంబంధించి వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్రామాల్లోని రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయాధికారులు, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు, గ్రామ కో-ఆర్డినేటర్లు పనిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలను రైతులకు అందించడంలో జాప్యం చేయవద్దన్నారు.

లబ్ధిదారులందరికీ తగిన న్యాయం చేయాలన్నారు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు వివిధ రకాల పంటలను పండించేలా సూచనలను అందించాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. అనంతరం ఏడీఏ పద్మావతి, ఏరువాక శాస్త్రవేత్త నరేందర్ మాట్లాడుతూ.. వరికి ప్రత్యామ్నాయంగా రాగులు, కొర్రలు, జొన్నలు తదితర చిరుధాన్యాలను సాగు చేసుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధించవచ్చన్నారు. సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు గూదె బాల్‌నర్సింహ, ఆత్మ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో సరిత, మండల వ్యవసాయాధికారి బి.సైదులు, ఏఈవోలు శ్రవణ్, రఫీ, హేమ, మౌనిక, పలు గ్రామాల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు, సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...