కారు.. జోరు


Thu,July 18, 2019 12:43 AM

-టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీపీ వెంకట్‌రెడ్డి
చౌటుప్పల్, నమస్తేతెలంగాణ: ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. కొత్త , పాత కలయికతో టీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని కీతాబిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతిపక్షాలు కనుమరుగయ్యాయని తెలిపారు. పార్టీలో పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలపై దృష్టి సారించాలన్నారు.

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి , మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం మంచి పరిణామన్నారు. ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలాభివృద్ధికి కాంగ్రెస్ వీడి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో కాంగ్రెస్ బ్లాక్, మండల అధ్యక్షులు గుండు మల్లయ్యగౌడ్, చింతల వెంకట్‌రెడ్డి, వెన్‌రెడ్డి రాజు, తాడూరి పరమేశ్, బొంతల ఓంప్రకాశ్, చక్రం జంగయ్య, దైద జగన్‌మోహన్‌రెడ్డి, మేకల నర్సింహ, చెంచల మల్లేశ్, పోచయ్య, కోడి కృష్ణ, వర్కూరి రాజు, గంధం ఆంజనేయులు, మంటిపల్లి గణేశ్, కానుగు శేఖర్, చక్రం కుమార్‌తోపాటు మరో 200 మంది ముఖ్య నాయకులు ఉన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...