విద్యార్థులకు ప్రభుత్వం చేయూత


Thu,July 18, 2019 12:43 AM

-మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆలేరు విద్యార్థికి రూ. 50వేలు ప్రోత్సాహకం అందజేత
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నదని రాష్ట్ర గిరిజన, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సంక్షేమ శాఖ హాస్టళ్లలో చదివి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వార్డెన్లకు బుధవారం హైదరాబాద్‌లో పారితోషికం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సహం అందజేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యను అభ్యసించిన విద్యార్థులు నేడు ఎన్నో ఉత్తమ పదవులను సాధిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం సాకారమయ్యాక రాష్ట్ర గిరిజన , ఎస్సీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి అమలు చేస్తున్నారన్నారు. ఫలితంగా ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి ఎంతో మెరుగుపడిందని చెప్పారు. అన్ని కులాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం పురోగమిస్తుందని సీఎం భావించడం వల్ల అనేక కొత్త పథకాలకు శ్రీకారం పలికిన విషయాన్ని ఉదహరించారు. ముఖ్యంగా హాస్టళ్లకు సన్న బియ్యం పంపిణీ చేయడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు.

సిద్ద్దార్థకు అభినందనలు..
ఆలేరు బాలుర ఎస్టీ హాస్టల్‌లో విద్యను అభ్యసించి 10/10 జీపీఏ సాధించిన సిద్దార్థ అనే విద్యార్థిని మంత్రి అభినందించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రూ.50వేల విలువగల చెక్కును ప్రోత్సహకంగా అందజేశారు.జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ అధికారి మంగ్తానాయక్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను మంత్రి ప్రశంసించారు. వందశాతం ఫలితాలు హాస్టళ్లలో రావడం వల్ల ప్రభుత్వం ఇస్తున్న చేయూత పేదలు పొందే అవకాశం కలుగుతుందని చెప్పారు.

ఆలేరు ఎస్టీ హాస్టల్ అభివృద్ధి కోసం వార్డెన్ ప్రభువరంకు రూ. 20వేల విలువగల చెక్కును అందజేశారు. అదేవిధంగా పదోతరగతిలో 100 శాతం ఫలితాలు సాధించిన విభాగంలో ఆలేరు ఎస్టీ బాలుర హాస్టల్, తుర్కపల్లి మండలంలోని మాధాపురం ఎస్టీ బాలుర హాస్టల్, తుర్కపల్లి మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర ఎస్టీ హాస్టళ్ల వార్డెన్లు ప్రభువరం, సోమరాజు, గౌతమ్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మంగ్తానాయక్‌లకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినాలు చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ.20వేల విలువైన చెక్కులను అందజేశారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...