హామీలు నెరవేర్చేందుకే టీఆర్‌ఎస్‌లో చేరిక


Wed,July 17, 2019 12:00 AM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకే టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నానని ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. అభివృద్ధి జరుగాలంటే టీఆర్‌ఎస్ లోకి రావడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. లక్కారంలోని శిల్పి హోటల్‌లో ఎంపీపీ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో ఉంటే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేమని తెలిపారు. అందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని ఆయన పేర్కొన్నారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ లో తీవ్ర అనిశ్చితి నెలకొందన్నారు. అందుకే స్థానిక సంస్థ ల ఎన్నికల్లోనూ స్వల్ప మెజార్టీతో సీట్లు కైవసం చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ వీడితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గం తీవ్ర సంక్షోభం లో పడిందన్నారు. అయినప్పటికీ పీసీసీ నుంచి కాని జిల్లా స్థాయి నాయకుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. పార్టీ స్థితిగతులపై తమను కనీసం సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్పప్పటికీ అభివృద్ధి జరుగడం లేదన్నా రు. దీంతో తామంతా తీవ్ర ఆందోళన లో ఉన్నామని తెలిపారు. బంగారు తెలంగాణ లో భాగస్వామ్యులమవుతుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నాయకత్వంలో చౌటుప్పల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు , మండల, బ్లాక్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు,కార్యకర్తలతో టీఆర్‌ఎస్‌లో చేరుబోతున్నామన్నారు. ఇప్పటి వరకు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ బ్లాక్, మండలాధ్యక్షులు గుండు మల్లయ్యగౌడ్, చింతల వెంకట్‌రెడ్డి, నాయకులు వెన్‌రెడ్డి రాజు, నల్ల నరేందర్‌రెడ్డి, తాడూరి పరమేశ్, దైదమోహన్‌రెడ్డి, చింతల సాయిలు, ఓం ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...