అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి


Tue,July 16, 2019 11:59 PM

బీబీనగర్ : మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణితాపింగళ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన అంగన్‌వాడీ కేంద్రాల సూపర్‌వైజర్లు, నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలు, బాలింతలు, గర్భిణుల పూర్తి వివరాలను ఆయా సెంటర్ల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే తమ సెంటర్లలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్ల నిర్వాహకులు నిబద్దతతో తమ సేవలందించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ ఆయా సెంటర్లలో నెలకొన్న సమస్యలను తీర్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించడం కష్టంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి పక్కా భవనాలు ఏర్పాటు చేసేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి ఒక్కటి అందేలా నిర్వాహకులు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రావణ్‌కుమార్, అంగన్‌వాడీ సెంటర్ల సూపర్‌వైజర్లు, నిర్వాహకులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...