పొరపాట్లకు తావివ్వకూడదు


Tue,July 16, 2019 03:11 AM

బీబీనగర్: మండలంలోని రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పొరపాట్లకు తావివ్వకుండా మెరుగైన సేవలందించాలని ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్ అన్నారు. సోమవారం మండల కేం ద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ రైతులు ఎన్నో ఏండ్లుగా చిన్న చిన్న సమస్యలతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. వాటని పరిష్కరించే దిశగా తహసీల్దార్, నూ తన వీఆర్వోలు కృషి చేయాలని కోరారు. విద్యార్థుల కు ఆదాయ,కుల ధ్రువీకరణపత్రాల జారీలో జాప్యం చేయకూడదన్నారు. గెజిటెడ్ సంతకం కోసం విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆయా గ్రా మాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయులను భాగస్వా మ్యం చేస్తే ఈ సమస్య తీరుతుందన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తహసీల్దాకు సూచించారు. కల్యాణలక్ష్మి దరఖా స్తు కోసం అవసరమయ్యే పత్రాల వివరాలను గ్రామాల్లో నోటిసు బోర్డుల్లో ఏర్పా టు చేయాలన్నారు. రైతులకు పాసుబుక్కులు అందించాలన్నారు. వీఆర్వోలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో తమ కార్యకలాపాలు కొనసాగించుకునేలా చూడాలని కోరారు. ఖచ్చితమైన స్థలం లేకపోవడంతో గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం వరకు రావాల్సి వస్తుందన్నారు. అదే గ్రామపంచాయతీలో పని చేసుకునేలా చోటు కల్పిస్తే ప్రతి రోజు గ్రామస్తులకు అందుబాటులో ఉంటామన్నారు. అనంతరం ఎంపీపీ రైతులకు నూతన పాసుపుస్తకాలను అందజేశారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌ను తహసీల్దార్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీఆర్వోలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కల్పన, ఆర్‌ఐ రమేశ్, వీఆర్వోలు సైదాసాహెబ్, అయిలయ్య, రమేశ్, శ్రీనివాస్, యా దయ్య, వెంకట్‌నర్సింహరెడ్డి, అనూష, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...