ప్రభుత్వం అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలి


Mon,July 15, 2019 11:14 PM

తుర్కపల్లి: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బూక్యా సుశీల రవీందర్ అన్నారు. మండలంలోని ధర్మారంలో సోమవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశువులకు సోకే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండి వైద్యుల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ మాగ్తనాయక్, మదర్‌డెయిరీ చైర్మన్ కృష్ణ, పశువైద్యాధికారులు భాస్కర్, జనార్దన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...