రైతుల సమస్యలు పరిష్కరించడంలో


Mon,July 15, 2019 12:14 AM

-రెవెన్యూ అధికారులు విఫలం
ఆలేరుటౌన్‌ : రైతుల సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంపాల దశరథ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలేరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రతి పనికి రైతుల నుంచి లక్షలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతుల నుంచి వారి రక్తం గుంజుతూ ఆర్థికంగా రైతులను దివాళా తీస్తున్నారన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల మాయలో పడి రైతులు తమ విలువైన భూములను అమ్ముకుంటున్నారి చెప్పారు. రెవెన్యూ అధికారులు చేసే అక్రమాల గురించి ధర్మగంట ద్వారా ప్రజలకు తెలుస్తున్నాయన్నారు. గతంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల తీరుతో రైతులు విసిగిపోయారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారుల నిర్లక్ష్యం తీరునూ నిరసిస్తూ రేపు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆలేరు మండల తహసీల్దారు కార్యాలయం ఎదుట ఉదయం 10.30 గంటలకు నిరశన దీక్ష చేపడుతామని తెలిపారు. ఈ దీక్షకు మండలంలోని రైతులు, రాజకీయ పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...