సూచికబోర్డును ఢీకొట్టిన బైక్‌ : వ్యక్తి మృతి


Mon,July 15, 2019 12:14 AM

ఆత్మకూరు(ఎం): ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డును బైక్‌ ఢీ కొని యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మక్తాల నవీన్‌గౌడ్‌(32)హైదారాబాద్‌లోని ఉప్పల్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ మోత్కూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. విధులు ముగించుకొని శనివారం రాత్రి బైక్‌పై మోత్కూర్‌కు వస్తుండగా మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామ శివారులో బునాదిగాని కాల్వ నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న కల్వర్టు వద్ద ఏర్పాటు చేసిన ప్రమాద సూచిక బోర్డును గమనించక బలంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై నవీన్‌ అక్కడిక్కక్కడే మృతి చెందాడు మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కనకటి యాదగిరిగౌడ్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా దవాఖానకు తరలించారు. బాధిత పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లగ్గాని రమేశ్‌గౌడ్‌, పోతిరెడ్డిపల్లి సర్పంచ్‌ గనగాని మాధవీమల్లేషంగౌడ్‌ కోరారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...