ఘనంగా శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి


Mon,June 24, 2019 01:34 AM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : జనసంఘ వ్యవస్థాపకుడు డా. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మున్సిపాలిటీ కేంద్రంలో ఆదివారం బీజేపీ నాయకులు బలిదాన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భం గా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడు తూ దేశానికి ఇద్దరు ప్రధానులు, రెండు విధానాలు వద్దని, ఒకే దేశం, ఒకే ప్రజా, ఒకే విధానం అమలు చేయాలని తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన గొప్ప వ్యక్తి శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూడల భిక్షంగౌడ్, నాయకులు మన్నె ప్రతాప్‌రెడ్డి, ఉబ్బు బుచ్చయ్య, ఊడుగు యాదయ్యగౌడ్, కట్ట కృష్ణ, నూతి యాదయ్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్యామ్ ముఖర్జీ వర్ధ్దంతి...
సంస్థాన్‌నారాయణపు రం : భారతీయ జనాతాపార్టీ సిద్ధాంతకర్త జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్.శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలను ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. శ్యామ్‌ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి బచ్చనబోయిన దేవేందర్‌యాదవ్ మాట్లాడుతూ సమైక్య భారతదేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన భారతమాత ముద్దు బిడ్డ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఈతని ఆశయాలను, ఆదర్శాలను భారతీయజనతా పార్టీ ఆచరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అద్యక్షుడు దాసోజు వెంకటాచారి, జక్కర్తి భిక్షం, రాసాల వెంకటేశం, గ్రామశాఖ అద్యక్షుడు గూడూరు ఇంద్రసేనారెడ్డి, సూరపల్లి శివాజీ, వీరమల్ల జంగయ్య, రాపర్తి ప్రదీప్‌గౌడ్, బద్దం గిరిగౌడ్, కొర్ర నరేందర్, ఎలిజాల శ్రీను, భూస శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...