కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు


Sun,June 23, 2019 05:07 AM

సంస్థాన్‌నారాయణపురం: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన్మాత్మకతను వెలికితీసే విధంగా బోధన జరుగాలని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ నాయకుల విగ్రహావిష్కరణకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాఠశాల భూదాత మద్ది నారాయణరెడ్డి విగ్రహం తోపాటు డా. బీఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం విగ్రహాలను ఆవిష్కరించారు. అంతకుముందు విద్యార్థులు మంత్రికి గౌరవ వందనం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సర్వేల్ గురుకుల పాఠశాల ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ పాఠశాలలో చదివినవారు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లుగా స్థిరపడ్డారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు పట్టుదలతో చదువాలన్నారు. ఈ పాఠశాలలో చదువుకోవడానికి చాలామంది పోటీపడేవారన్నారు.

విద్యనందించడంలో విద్యాశాఖ మంత్రి నుంచి ఉపాధ్యాయుడు, అటెండర్ వరకు అందరి పాత్ర విలువైనదేనన్నారు. మహానుభావుల విగ్రహాల ఆవిష్కరించడం ద్వారా వారి ఆశయాలను పునికిపుచ్చుకోవాలన్నారు. చదువుకోవాలనే ధృడసంకల్పం ఉంటే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చనే నిజాన్ని విద్యార్థులు గ్రహించాలని సూచించారు. బహుభాష కోవిదుడు , గొప్ప సాహితీ వేత్త మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు ఆలోచనలతో గురుకుల పాఠశాలలు ఆవిర్భవిస్తే చేస్తే మదిరెడ్డి నారాయణరెడ్డి సహృదయంతో సర్వేల్‌లో పురుడు పోసుకుందని తెలిపారు. ప్రపంచ దేశాలు మనదేశం వైపే చూసేలా రాజ్యంగాన్ని నిర్మించిన డా. బీఆర్ అంబేద్కర్, సముద్రం ఒడ్డున ఆల్‌చిప్పలతో ఆడుకునే స్థాయి నుంచి క్షిపణి పితామహుడిగా ఎదిగిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అడుగుజాడాల్లో విద్యార్థులు నడిచి దేశానికి ఖ్యాతిని పెంచాలని ఆకాంక్షించారు. తాను 1 నుంచి 5వ తరగతి వరకు చెట్ల కింద చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు. చదువుకోవాలనే బలమైన ఆకాంక్ష ఉంటే ఓటములు దూరమై విజయాలు మన దరికి చేరుతాయన్నారు. బట్టి పట్టే విధానాన్ని విడనాడాలని సూచించారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కుంగిపోకుండా పట్టుదలతో చదివి రాణించాలన్నారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతేనే విజయం వరిస్తుందని గుర్తించాలన్నారు. కార్పొరేట్‌కు దీటుగా గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీసీ గురుకుల పాఠశాలల సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, డీఈవో రోహిణి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష , కార్యదర్శులు నరేందర్, రాజశేఖర్, ఏసీపీ సత్తయ్య, తహసీల్దార్ దయాకర్‌రెడ్డి, జడ్పీటీసీ బొల్ల శివశంకర్, ఎంఈవో వెంకటేశం, ప్రిన్సిపాల్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

గురుకులాలు దేశానికే ఆదర్శం
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సమాజానికి పాటుపడినవారిని ఎప్పటికీ మరిచిపోకూడదన్నారు. అప్పట్లో గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు మద్ది నారాయణరెడ్డి 44 ఎకరాలు భూదానం చేయడం, వెంటనే మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు పాఠశాలను ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. పూర్వ విద్యార్థిగా ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కమార్ పాఠశాల అబివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. పాఠశాలలో కంప్యూటర్‌ల్యాబ్ కోసం ఎంపీ నిధులనుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదువకున్నందుకు 1996 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులందరం కలిసి మహనీయులు విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతేడాది పాఠశాల నూతన భవనాల కోసం రూ.18.66 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే విద్యాసంవత్సరంలో నూతన భవనాలు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ సందర్భంఆ పదోతరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్ధులు అంబటి శివ, గుత్త కీర్తనను అభినందించారు. అనంతరం విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొల్ల శివశంకర్, వైస్ ఎంపీపీ ఆంగోతు రాజు, ఎంపీటీసీలు షబ్బీర్, కత్తుల లక్ష్మయ్య, సర్పంచులు కట్టెల భిక్షపతి, సర్వి యాదయ్య, దోనూరు జైపాల్‌రెడ్డి, పాండురంగ, కత్తుల సురేశ్‌కుమార్, మన్ని పుష్పలత, జక్కర్తి పాపయ్య, ఒగ్గు గణేశ్, నూతన ఎంపీపీ గుత్త ఉమాప్రేమ్‌చందర్‌రెడ్డి, జడ్పీటీసీ వీరమల్ల భానువెంకటేశంగౌడ్, ఎంపీటీసీలు ఈసం యాదయ్య, నర్రి పావని, కరంటోతు కవిత, విజయ, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, కార్యదర్శి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...