యాదాద్రిలో నిత్య పూజల కోలాహలం


Sun,June 23, 2019 05:04 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శనివారం వారాంతపు భక్తుల రద్దీ కొనసాగింది. యాదా ద్రిలో నిత్య పూజల సందడి కొనసాగుతున్నది. భక్తులు పలు ప్రాంతాల నుంచి రావడంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. శ్రీవారి ధర్మదర్శనాలతో 2 గంటలు, ప్రత్యేక దర్శనాలతో గంట సమయం పట్టింది. బాలా లయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలు కుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు నిర్వహించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉద యం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నార సింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యా ణ తంతును నిర్వహించారు. కల్యాణ మూర్తులను ము స్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తుల కు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వ హిం చారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామివారికి జరిగిన పూజల్లో కూడా భక్తులు పాల్గొన్నారు. వ్రత మండపంలో శ్రీసత్య నారాయణస్వామి వ్రత పూజలలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

ప్రతేక పూజలు...
శ్రీవారిని సినీ నటుడు గుండు సుదర్శన్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు, ఆలయ ఉప ప్రధానార్చకులు భట్టర్ సురేంద్రాచార్యులు ఆశీర్వవచనం జరిపి శ్రీవారి ప్రసాదం అందచేశారు.

శ్రీవారి ఖాజానాకు రూ. 12,62,929 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 12,62,929 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ తో రూ.1,14,646, 100 రూపాయల టికెట్‌తో రూ. 44,300, కల్యాణకట్ట ద్వారా రూ. 34,800, గదులు విచారణ శాఖతో రూ. 82,070, ప్రసాద విక్రయాలతో రూ.5,14,040, శాశ్వత పూజలతో రూ.27,348 ఆదా యం సమకూరినట్లు ఆమె తెలిపారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...