రైతుల భూ రికార్డులను ఆన్‌లైన్‌లో పూర్తి చేస్తాం


Sun,June 23, 2019 05:04 AM

రామన్నపేట : రైతుల భూ రికార్డులను పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. మండల కేంద్రంలోని శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి భూ రికార్డుల ఆన్‌లైన్‌ను పరిశీలించారు. అనంతరం, ఆమె విలేకరులతో మాట్లాడుతూ. జిల్లాలో మొత్తం 59 వేల 600 ఖాతాలు ఉండగా అందులో 24 వేలు పార్టు-బీ (వివాదాలు ఉన్న భూమి), 24వేలు నాలా ఉండగా 11 వేల 600 రైతుల ఖాతాలు ఉన్నాయని వీటిని నెల ఆఖరిలోగా ఆన్‌లైన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వలకు భూములు కోల్పోయిన రైతులకు త్వరలో నష్టపరిహారం చెల్లిస్తామని, ట్రెసరిలో ఆన్‌లైన్ ఇబ్బందులు ఉన్నాయని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆమె తెలిపారు. ప్రభుత్వం రూ.76 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.13 కోట్లు రైతుల ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. సాగునీటి, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమె వెంట స్థానిక తహసీల్దార్ వి.బ్రహ్మయ్య రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...