రాయగిరిలో ఘనంగా పోచమ్మతల్లి బోనాలు


Sun,June 23, 2019 05:04 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ : గ్రామదేవతల పండుగల్లో భాగంగా శనివారం మండలంలోని రాయగిరి గ్రామంలో పోచమ్మతల్లి బోనాలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలు ఉదయం నుంచే బోనాల ఏర్పాట్లలో నిమగ్నమై నిష్టలతో బోనాలను తయారు చేసుకుని ఊరేగింపుగా డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు. ఈకార్యక్రమంలో మాజీసర్పంచ్‌లు బల్ల విమలచంద్రశేఖర్, కళ్లెం బాలనర్సింహ్మ, ఎరుకల నర్సింహ్మ, ఎన్నబోయిన అంజనేయులు, గుండ్ల ఉపెందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు కళ్లెం బాలమణి, మాజీ ఎంపీటీసీ సభ్యులు పాల్త్య హనుమంతునాయక్, మాజీ ఉపసర్పంచ్ సార నర్సింహ్మ, గ్రామస్థులు అవస్థీ రాజేంద్రప్రసాద్, చింతల కిష్టయ్య, పల్లెర్ల యాదగిరి, బొజ్జ ఎల్లేశ్, గడ్డమీది మల్లేశ్, దాసరి శ్రీనివాస్, రవిందర్, అంకర్ల సంజీవ, పోచంపల్లి రవిందర్, రమేశ్, గోపయ్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోచమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ సభ్యు డు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి...మండలంలోని రాయగిరి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మతల్లి ఆలయం ప్రత్యేక భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు పరిధిలోని ప్రజలకు అనునిత్యం అండగా ఉంటూ సేవ చేస్తానన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...