బిందుసేద్యంతో అధిక దిగుబడులు సాధించవచ్చు


Sun,June 23, 2019 05:03 AM

చౌటుప్పల్ రూరల్ : బిందుసేద్యంతో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని డివిజన్ ఉద్యాన పట్టుపరిశ్రమ శాఖ అధికారి భిక్షపతి అన్నారు. శనివారం మండలపరిధిలోని ఓ వ్వవసాయ క్షేత్రం లో బిందుసేద్యంపై జైన్ ఇరిగేషన్ సిస్టమ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో నీటి ఎద్దడి రాకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు. ఇందుకోసం విరివిగా బిందుసేద్యం ఏర్పాటు చేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెదురు, శ్రీగంధం, మల్బరీసాగు పథకాల గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన మండల విస్తరణ అధికారులు శ్రీనివాస్, రాజేశ్, రైతులు వెంకన్న, భిక్షమయ్య, సంజీవరెడ్డి, వినోద్, జైన్ కంపెనీ ప్రతినిధులు నర్సింహ్మ, భరత్, వెంకటేశ్, మట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...