పల్లెలో పండుగ


Sat,June 22, 2019 12:24 AM

-అంబరాన్నంటిన కాళేశ్వరం సంబురాలు
-గోదారమ్మకు ఘనస్వాగతం పలికిన జిల్లా ప్రజలు
-తెలంగాణ ప్రజల జీవనజ్యోతి కాళేశ్వరం
-వర్షాధారిత ప్రాంతమైన ఆలేరుకు మహర్దశ
-యాదాద్రిలో ప్రత్యేక సుదర్శన నారసింహ హోమం
-భువనగిరిలో అమరులకు నివాళి.. పటాకుల మోత
-సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు
యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : గోదారమ్మకు స్వాగతం పలికేందుకు డప్పు చప్పుళ్ల హోరు.. ఆలయాల్లో పూజలు.. చర్చీల్లో ప్రార్థనలు.. మసీదుల్లో ప్రత్యేక అజా మరో వైపు పటాకుల మోత.. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు... వీటన్నింటినీ తలదన్నే విధంగా బతుకమ్మ ఆటలతో జిల్లాలో శుక్రవారం పండుగ వాతావరణం కనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా బడుగు జీవుల నుంచి సామన్యుడి వరకు సంబురాలు చేసుకున్నారు. ఏండ్ల కల సాకారమైందని సాగునీటిని కండ్ల చూస్తమని అనుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు. బీడువారిన భూముల్లో పసిడి రాసులు జాలువారే నేపథ్యం మరికొద్ది రోజుల్లో సాక్షాత్కారమవుతుందని రైతన్నలు మురిసిపోతుండగా పల్లె మొదలు పట్నం వరకు ఆనందహేళీ వెల్లివిరిసింది. జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు.. స్వీట్లు పంపిణీ చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు. వినాయక చౌరస్తా వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం జరిపారు. కలెక్టర్ అనితారామచంద్రన్ డీఆర్‌డీవో కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి జిల్లా స్థాయిలో సంబురాలను ప్రారంభించారు.యాదాద్రిలో దేవస్థానం పక్షాన నిర్వహించిన సుదర్శన నారసింహ హొమంలో పాల్గొని పూజలు చేశారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీత పూజల్లో పాల్గొన్నారు.

భువనగిరి నియోజకవర్గంలో..
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు కాళేశ్వరం ప్రారంభం పురస్కరించుకొని సంబురాలు చేసుకున్నాయి. భువనగిరి పట్టణంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ర్యాలీ నిర్వహించి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెక్సీకి క్షీరాభిషేకం చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ, తదితర కార్యక్రమాల్లో కలెక్టర్ అనితారామచంద్రన్ పాల్గొని కేక్ కట్ చేసి మాట్లాడారు. కాళేశ్వర పాజలాలు భువనగిరి ప్రాంతానికి రావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భువనగిరి మండలంలోని రాయగిరి, తుక్కాపురం, తాజ్‌పూర్, పెంచికల్‌పహాడ్, అనంతారం, చందుపట్ల తదిర గ్రామాల్లో కాళేశ్వర ప్రాజెక్టు ప్రారంభ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి, పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. బీబీనగర్ మండల కేంద్రంలో ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎరుకల సుధాకర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. వలిగొండ మండలంలోని గ్రామాలతో పాటు, మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంతో పాటు, వివిద గ్రామాల్లో సంబురాలు జరుపుకున్నారు.

ఆలేరుకు మహర్దశ..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వర్షాధారిత ప్రాంతమైన ఆలేరుకు మహర్దశ రానున్నది. నియోజకవర్డంలోని ఆయా మండలాల్లో ప్రధాన కూడలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలం కాబోతుందని అభివర్ణించారు. కేసీఆర్ నిండూనూరేళ్లు ఆయూరారోగ్యాలతో జీవించాలని లక్ష్మీనరసింహస్వామివారి వేడుకున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మోటకొండూర్ మండల పరిధి కాళేశ్వరం ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.

రాజాపేటలో మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం చిన్న మేడారంలో సమ్మక్క సారలమ్మ తల్లికి పూజలు చేశారు. ఆత్మకూరు(ఎం) మండలంలోని పలు గ్రామాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సంబురాలు ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో టీఆర్‌ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కాంబోజు భాగ్యశ్రీ, మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, జిల్లా నాయకులు బీసు చందర్‌గౌడ్, కోరే భిక్షపతి, యాస ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. బొమ్మలరామారం మండల కేంద్రంలో బస్టాండ్ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. తుర్కపల్లి మండల కేంద్రంతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ఆవిర్భావ సంబురాలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తుర్కపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్, నూతనంగా ఎంపికైన ఎంపీపీ భూక్యా సుశీల ఆధ్వర్యంలో సంబురాలు ఘనంగా నిర్వహించారు. సీట్లు పంపిణీ చేశారు.

చౌటుప్పల్‌లో...
చౌటుప్పల్ మండల వ్యాప్తంగా కాళేశ్వరం సంబురాలు అంబరాన్నంటాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహించిన కాళేశ్వరం సంబురాల్లో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జెల్లా మార్కండేయులుతో కలిసి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండల వ్యాప్తంగా వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీవెంకటేశంగౌడ్ పాల్గొన్నారు. రామన్నపేటలో కాళేశ్వరం సంబురాలు అట్టహాసంగా జరిగాయి. అన్ని గ్రామాల్లో వేడుకలను నిర్వహించారు. మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అడ్డగూడూరు మండల వ్యాప్తంగా కాళేశ్వరం సంబురాలు అంబరాన్నంటాయి. మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కోఆప్షన్ మెంబర్ జోసఫ్ పాల్గొన్నారు. స్వీట్లు పంపిణీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతమని అభివర్ణించారు. చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోవడం ఆనందాన్నిచ్చిందని తెలిపారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...