యోగానందం


Fri,June 21, 2019 12:22 AM

యోగా చిత్తవృత్తి నిరోధక అని శాస్త్రం చెబుతోంది. మనం చేసిన పనులు, చూసిన దృశ్యాలు, వినడం ద్వారా గ్రహించిన అంశాలను గుర్తించుకునే ప్రదేశాన్నే చిత్తం అంటారు. ఇందులో చెడు ఆలోచనలను తొలగించుకోవడమే యోగా సాధన. బుద్ధి, మనస్సు ప్రశాంతంగా ఉండి జ్ఞానేంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవడంతో శరీరంలోని అవయవాలు సక్రమంగా, స్వేచ్ఛగా పని చేస్తాయి. అప్పుడు పరిపూర్ణ ఆయుష్షును పొందవచ్చని వేదాలు చెబుతున్నాయి.
మన దేహం 300ఎముకల జాయింట్లు, 700కు పైగా కండరాలు, 16,000 కిలోమీటర్ల పొడవు కలిగిన నాడీ తంతువులు, 96వేల కిలోమీటర్ల పొడవైన రక్తనాళలతో నిర్మితమైంది. వీటన్నింటినీ పనిచేయించే నాడీకేంద్రాలు మన మెదడులో సుమారుగా 20వేలకు పైగా ఉంటాయి. ఒక్కో నాడీ కేంద్రం శరీరంలో ఒక్కో అవయవానికి నాడీ తంతువు ద్వారా నేరుగా కలపబడి ఉంటుంది. నాడీ కేంద్రం సక్రమంగా పనిచేయకపోతే ఆ అవయవం చేయాల్సిన పనిని సక్రమంగా చేయలేదు. దీనినే రోగం అంటారు. సక్రమంగా పనిచేయని నాడీ కేంద్రాన్ని సరిగా పనిచేయించే ఓ అద్భుతమైన ప్రక్రియే యోగా. యోగాలో పరాకాష్ట దశ సమాధి అభ్యాసం. దీనిని శాస్త్రీయ పద్ధతిలో అలవర్చుకుని సాధన చేయగలిగితే ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధినైనా మందులు అవసరం లేకుండా నివారించుకునే వీలుంటుంది.

యోగా.. దాని పుట్టుక
యోగా అనే శబ్ధం ఇజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. ఇజ్ అంటే రెండింటి కలయిక అని అర్థం. అంటే పైకి కనిపించే స్థూల శరీరం, కంటికి కనిపించకుండా స్థూల దేహాన్ని నడిపించే సూక్ష్మ శరీరం. ఈ రెండు ఒకేచోట కలిసి పనిచేస్తుంటే అదే యోగం లేదా ధ్యానం అంటారు. దీనిని క్రీస్తుపూర్వం 5వేల ఏళ్ల క్రితం భారతదేశానికి చెందిన యోగా పితామహుడు పతంజలి మహర్షి తెలియజేశారు. ఆయన యోగాను ఎనిమిది భాగాలుగా విభజించి దానికి అష్టాంగ యోగమనే పేరు పట్టారు. ఈ ఎనిమిది అంగాల్లో శారీరక శుద్ధి కోసం ఐదు చెప్పబడ్డాయి. అవి ఒకటి యమ, రెండు నియమ, మూడు ఆసన, నాలుగు ప్రాణాయామ, ఐదు పత్యాహార అని అంటారు. మనసును శుద్ధి చేయడం కోసం మూడు చెప్పబడినవి. ఈ ఎనిమిదింటిలో సమాధి స్థితికి చేరుకోవడం యోగాకు పరకాష్ట దశగా చెబుతారు.

యమ : మన గురించి మనం తెలుసుకోవడం.
నియమ : ఏది ధర్మమో తెలుసుకుని ధర్మపద్ధతిలో జీవించడం.
ఆసనాలు
శరీరాన్ని గంటల కొద్దీ కదలకుండా నిశ్చల స్థితిలో ఉంచే ప్రక్రియనే ఆసనాలు అంటారు.
ప్రాణాయామ : నియమబద్ధంగా ప్రాణవాయువును తీసుకుంటూ మన శరీరంలో ఉన్న 72వేల నాడులను శుద్ధి చేసుకునే పద్ధతి.
ప్రత్యాహార : ఇంద్రియాలను ఆధీనంలోకి తెచ్చుకోవడం.
ధారణ : మనసులో ఏదైనా ఒక రూపాన్ని ఏర్పర్చుకోవడం.
ధ్యానం : ఆ ఊహాచిత్రంపై మనసును లగ్నం చేసుకుంటూ కొనసాగించే ధ్యానం.
సమాధి : కొంత సమయానికి ఆ ఊహా చిత్రం కరిగిపోయి శూన్యస్థితి ఏర్పడుతుంది. దీనినే సమాధి అంటారు. ఈ స్థితిలో చేతన మనస్సు(కాన్షియస్ మైండ్)ను నిద్రపోయి, ఉప చేతన మనస్సు(సబ్ కాన్షియస్ మైండ్)మేలుకుని ఉంటుంది. ఇటువంటి స్థితినే తుర్య స్థితి అంటారు. తుర్య అంటే అర్థ నిద్రావస్థ, అర్ధ జాగృతావస్థ, అర్ధ స్వప్నావస్థ. ఈ మూడు అవస్థలను ఏకకాలంలో అనుభవించే ప్రక్రియ. ఈ స్థితికి చేరుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న రక్తం అవసరమైనంత వరకు మెదడుకు ఉధృతంగా చేరుకోవడం. అంటే ప్రవాహం లాగా వెళ్లి అక్కడ నాడీ కేంద్రాల్లో పేరుకపోయిన మలినాలను బయటకు తెస్తుంది.
యోగాలో సైన్స్ : యోగాలో సైన్స్ ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. మన శరీరంలో వివిధ చోట్ల ఉండే స్వాదీష్టాన(ఎడ్రినల్ గ్లాండ్), మణిపూరక(ప్యాక్రియాస్ గ్లాండ్), విశుద్ద(ధైరాయిడ్ గ్లాండ్), ఆజ్ఞ(పిట్యుటరీ గ్లాండ్), సహస్ర్తార (పీనియల్ గ్లాండ్) వంటి గ్రంథులు సక్రమంగా పనిచేయకుంటే అవయవాల పనితీరులో మార్పు రావడం, ఆలోచనల్లో మార్పు రావడం తద్వారా జీవితం నరకప్రాయంగా మారడం జరుగుతుంది. వీటిని యోగా సాధనలోని వివిధ


పద్ధతుల ద్వారా సక్రమంగా పనిచేయించుకోవచ్చు. డాక్టర్లు, శాస్త్రవేత్తలు, మేధావులు సైతం ఈ మార్గాన్నే సూచిస్తున్నారు. యోగాతో మానసిక ఒత్తిడి, అతి బరువు, దీర్ఘకాలిక రుగ్మతలు తొలుగుతాయి. ప్రస్తుతం అన్ని చోట్ల యోగా శిక్షణను ఉచితంగా అందిస్తున్నారు.
యోగాతో కలిగే లాభాలు...
-యోగా నిరంతర ప్రక్రియ. చేస్తున్న కొద్దీ శరీరం తేలికవడంతోపాటు ప్రశాంతత లభిస్తుంది. జీవనశైలిలో మార్పు వస్తుంది. యోగాతో రోజంతా పనిచేసినా కండరాల నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది.
-యోగాతో దీర్ఘకాలికంగా ఉండే శరీర రుగ్మతలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ గంటపాటు యోగా చేస్తే వ్యాధులు దరి చేరకుండా ఉంటాయని, ప్రాణాయామం ద్వారా శారీరక సమస్యలు తగ్గుతాయని మహిళలు ఆసక్తి చూపుతున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...