తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు


Fri,June 21, 2019 12:21 AM

ఆలేరుటౌన్: తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్.బూర నర్సయ్యగౌడ్ అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలో ఓ వివాహానికి హాజరైన అనంతరం ఆయన ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టాగానే ముందుగా తాగునీరు, సాగునీరుకు ప్రాధాన్యమిచ్చి మన దాహార్తిని తీర్చాడన్నారు. మిషన్ భగీరథ ద్వారా 90 శాతం ప్రజలకు తాగునీరు అందించామన్నారు. కోటి ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆకుపచ్చ తెలంగాణ సాధ్యంకానుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం నుంచి పూర్తయ్యేవరకు ప్రతిపక్షం వారు విమర్శలు చేస్తున్నారని, ఈ రోజు పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, విమర్శలు కాదు సలహాలు ఇవ్వాలన్నారు. లక్ష్మీనర్సింహస్వామి బీమా పథకం ద్వారా ఇప్పటికే సహాయం అందజేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం పూర్తిగా ప్రజాసేవకు అంకితమవుతానన్నారు. సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మెరిగాడి వెంకటేశ్, నాయకులు మెగులగాని మల్లేశం, కిష్టయ్య, పాండు, మదాని పిలిఫ్, నీలపెల్లి కవిత, సీస మహేశ్వరి, మెరిగాడి సుజాత పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...