విద్యుత్ దుబారా..!


Fri,June 21, 2019 12:20 AM

అడ్డగూడూరు : మండలంలో ఏగ్రామంలో చూసిన వీధిదీపాలు నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వెలుగుతుండడంతో వేలాది యూ నిట్ల విద్యుత్ వృథా అవుతున్నది.ఫలింతంగా విద్యుత్‌శాఖ ,గ్రామపంచాయతీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రత్యేక లైన్లు ఆన్,ఆఫ్ స్విచ్‌లను ఏర్పాటు చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం నిరంతరం విద్యుత్‌ను అందించడానికి రూ.వేల కోట్లు వెచ్చించి విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తుంది.విద్యుత్‌ను ఆదా చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉన్నా...దృష్టి సారించకపోవడంతో విద్యుత్ వృథా అవుతోంది.మండలంలోని 17 గ్రామపంచాయతీలలో ఇదే పరిస్థితి . ఏఊరుకెళ్లినా పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. పంచాయతీ ఆదాయం, జనా భా మేరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయగా రాత్రి పూట వేసుకొని ఉదయాన్నే ఆఫ్ చేసుకోవాల్సి ఉన్నప్పటికి అలా జరుగడం లేదు.ఆన్,ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ వాటిని ఏర్పాటు చేయకపోవడంతో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి.దీంతో గ్రామపంచాయతీల్లో వేలల్లో బిల్లులు వస్తున్నాయి.ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నది.ఇప్పటికైనా సంబంధింత అధికారులు స్పందించి గ్రామాల్లో వీధిలైట్లకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి ఆన్,ఆఫ్ లైన్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...