యాదాద్రిలో భక్తుల కోలాహలం ..!


Fri,June 21, 2019 12:20 AM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ శాస్ర్తోక్తంగా నిత్య పూజలు కోలాహలంగా కొనసాగాయి. గురువారం ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన శ్రీస్వామి అమ్మవార్లకు హారతి నివేదన జరిపారు. ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం, తులసీ అర్చన చేశారు. స్వర్ణపుష్పార్చన దర్శనమూర్తులను అర్పించారు. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం, అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. శివ సన్నిధిలో మహాశివుడిని ఆరాధిస్తూ అభిషేకం, అర్చన చేపట్టారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణీ చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి.

ఘనంగా వత్ర పూజలు...
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ. 63,500ల ఆదాయం సమకూరిం ది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

శ్రీవారి ఖజానాకు రూ. 8,40,095 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 8,40,095 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 90,672, 100 రూపాయల టిక్కెట్‌తో రూ. 35,000, కళ్యాణకట్ట ద్వారా రూ. 30,000, గదులు విచారణ శాఖతో రూ. 14,800, ప్రసాదవిక్రయాలతో రూ. 4,09,960, శాశ్వత పూజలతో రూ.12,000 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...