పంచముఖి వెంచర్ బాధితులకు న్యాయం చేస్తాం


Fri,June 21, 2019 12:20 AM

బీబీనగర్: మండల పరిధిలోని పంచముఖి వెంచర్‌లోని ప్లాట్లపై విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ శ్రీనివాస్‌రావు తెలిపారు. మండల పరిధిలోని 119 సర్వే నెంబర్‌లో 15 సంవత్సరాల క్రితం పంచముఖి పేరున లేఅవుట్ చేసి ప్లాట్లను విక్రయించారు. ఈ క్రమంలో బ్రాహ్మణపల్లికి చెందిన కొలను పెద్ద లక్షారెడ్డి ఆ భూమి తనకు చెందినదని తనపేరుపై మ్యుటేషన్ చేయాలని తహసీల్దార్‌ను కోరారు. ఈ మేరకు ఆ సర్వే నెంబర్‌లో ప్లాట్లను కొనుగోలు చేసినవారికి తహసీల్దార్ నోటీసులు పంపించారు. గురువారం ప్లాట్ల యజమానులు బీబీనగర్‌లోని పంచముఖి లేఅవుట్ దగ్గరకు చేరుకొని 15 ఏండ్ల క్రితమే కొనుగోలు చేసినట్లు దస్తావేజులను అధికారులకు చూపించారు. తామంతా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండటంతో ప్లాట్లపై పర్యవేక్షణ కొరవడిందని, ఇదే అదునుగా భావించిన కొందరు ఈ ప్లాట్లను కబ్జా చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. తమ ప్లాటను కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ 15 రోజుల్లోగా పూర్తి విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని హామీచ్చారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...