గామాభివృద్ధికి సహకరించాలి


Wed,June 19, 2019 11:41 PM

ఆత్మకూరు(ఎం) : గ్రామాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, అఖిలపక్ష పార్టీల నాయకులతో పాటు ప్రజలందరూ సహకరించాలని ఆత్మకూరు(ఎం) సర్పంచ్ జన్నాయికోడె నగేశ్ కోరారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో విడుతల వారిగా మురుగుకాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధులవెంట మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. అనంతరం ఎంపీటీసీ దిగోజు నర్సింహాచారి మాట్లాడుతూ.. గ్రామంలో పందుల బెడద తీవ్రంగా ఉండటంతో ఇండ్లల్లో నాటిన మొక్కలను పందులు తొలిగించడంతో పాటు వీధుల వెంట విచ్చలవిడిగా తిరుగుతుండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామంలో పందులు తీరుగకుండా అధికారులు వాటిని నిర్మూలించాలని కోరారు. అదేవిధంగా రోడ్లపై చెత్తను వేసే వారికి, నీల్లను వదిలిన వారికి నోటీసులు జారీ చేసి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఉప సర్పంచ్ దొంతరబోయిన నవ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి కళ్యాణ్‌రావు, ఏపీవో కరుణాకర్, గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ అనూప్‌సింగ్, మాజీ సర్పంచ్ పూర్ణచందర్‌రాజు, అఖిలపక్ష పార్టీల నాయకులు యాస ఇంద్రారెడ్డి, నాతిరాజు, మల్లేశం, పురుశోత్తం, ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం దశరథగౌడ్, నేతాజీ యువజన మండలి అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్, వెంకన్న, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...