సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి


Wed,June 19, 2019 11:41 PM

తుర్కపల్లి : గొర్రెలు, మేకలకు సీజనల్‌గా సోకే వ్యాధిలపై గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని వెటర్నరీ డాక్టర్ భాస్కరన్ అన్నారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని ముల్కలపల్లి, మోతిరాం తండా, గొల్లగూడెం గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల కాపరులకు ప్రభుత్వం అనేక సబ్సిడీలను కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ ఆయా గ్రామాల సర్పంచ్‌లు మల్లప్ప, బింగి మీనా పాండు, వైద్య సిబ్బంది, గొర్రెల కాపరులు ఉన్నారు.
గుండాల : పశు వైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న నట్టల నివారణ మందును రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సంగి వేణుగోపాల్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొమ్మాయిపల్లి, వెల్మజాల గ్రామాల్లో ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో గొర్రెలు, మేకలకు నట్టల బారి నుంచి కాపాడటం కోసం ప్రభుత్వం అందిస్తున్న నట్టల నివారణ మందులను గొర్రెలు, మేకల కాపర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగి బాలకృష్ణ, పశు వైద్యాధికారులు డాక్టర్ గోపాలకృష్ణ, యాకూబ్ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...