నట్టల నివారణ మందులు పంపిణీ..


Wed,June 19, 2019 11:41 PM

మోటకొండూర్ : తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ఉచితంగా అందిస్తున్న నట్టల మందులను బుధవారం మండల పరిధిలోని వర్తూరు గ్రామంలో సర్పంచ్ సుదగాని సత్తమ్మ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలకు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీకాంత్, ఎంపీటీసీలు ఎల్‌ఎస్‌ఏ మల్లారెడ్డి, మహేందర్, క్రాంతిరేఖ, ఐలయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : గొర్రెల కాపర్ల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం గొర్రెల ఆరోగ్యం కోసం ఉచితంగా పంపిణీ చేసిన నట్టల నివారణ మందులను బుధవారం మండలంలోని పారుపల్లిలో సర్పంచ్ లగ్గాని రమేశ్‌గౌడ్, గుండాల మండలం వైస్ ఎంపీపీ కాలె మల్లేశం గొర్రెల కాపర్లకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గొర్రెల కాపర్లు తమ గొర్రెలకు నట్టల నివారణ మందులు తప్పనిసరిగా వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి రేఖ, గొర్ల కాపర్ల సంఘం అధ్యక్షుడు దయ్యాల మల్లేశం, రమేశ్, శ్రీను, మల్లయ్య, గణేశ్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...