పునర్నిర్మాణ పనులు వేగవంతం


Wed,June 19, 2019 11:41 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రిశ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతమైనాయి. అత్యంత ప్రాధాన్యత గల గర్భాలయానికి బిగించనున్న పంచలోహ విగ్రహాలు బుధవారం సాయంత్రం యాదాద్రికి చేరుకున్నాయి. రూ. కోటి రూపాయలు వెచ్చించి మహాబలిపురంలో తయారు చేసిన విగ్రహాలు, ధ్వజస్తంభానికి స్వర్ణమయం చేసేముందుకు ఉపయోగించే రాగి వస్తువులు వచ్చేశాయి. ప్రధాన ద్వారంపై హంసలు, పద్మమలు మొదలైన వాటిని అమర్చి వాటికి బంగారు తాపడం చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 3800 కిలోల బరువుతో తయారు చేయించిన కలశాలు ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, వైటీడీఏ చైర్మన్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యవేక్షణలో అత్యంత సర్వాంగసుందరంగా నిర్మాణం జరుపుకుంటున్న యాదాద్రి పునర్నిర్మాణ పనుల్లో కొండపైన కనులకిపుగా రూపుదిద్దుకున్న ఆరు మహారాజగోపురాల పైన ఏర్పాటు చేయనున్న రాగి కలశాలు తయారైనాయి. వాటికి అవసరమున్నప్పుడు బంగారుతాపడం చేసుకునేందుకు వీలుగా వీటిని మహాబలిపురంకు చెందిన శిల్పి రాజేంద్రాచారి తయారు చేశారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఆధ్వర్యంలో స్థపతులు కె. సుందరరాజన్, డాక్టర్ ఆనందాచారి వేలు సూచనలతో తయారు చేసిన డిజైన్లకు మహాబలిపురంలోని శిల్పులు రూపమిచ్చారు. గర్భాలయంపైన నిర్మాణం చేసిన విమానగోపురానికి అవసరమైన కలశాలు కూడా కొండకు చేరుకున్నాయి. మహాబలిపురంలో స్టెయిర్‌కేస్ రెయిలింగ్‌ను కృష్ణశిలలతో శిల్పులు తయారు చేస్తున్నారు. అవి కూడా కొద్ది రోజుల్లోనే యాదాద్రికి వస్తాయని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీత తెలిపారు. ఆలయ విస్తరణ పనులు రోజు రోజుకు ముగింపు దశకు చేరుకుంటూ అత్యంత ప్రాధాన్యత గల పనులు కూడా పూర్తవుతుండటం విశేషం.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...