ప్రభుత్వ బడులతోనే బంగారు భవిష్యత్


Wed,June 19, 2019 11:40 PM

సంస్థాన్‌నారాయణపురం: ప్రభుత్వ బడులతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని జిల్లా విద్యాధికారిణి రోహిణి అన్నారు. రాచకొండ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా అక్షరాభ్యాసం కార్యక్రమానికి ఆమె హాజరైనారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాచకొండ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉండేవారని పాఠశాలను మూసివేద్దామని అనుకుంటున్న సమయంలో ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులను చేర్పించడంతో పాఠశాల నిలబడిందన్నారు. పాఠశాల బలోపేతానికి కృషి చేసినందుకు హెచ్‌ఎం యాదిరెడ్డి, ఉపాధ్యాయుడు నగేశ్‌యాదవ్, పాఠశాలకు ఫర్నీచర్ బహూకరించిన ఎన్నారై పున్న సురేశ్‌ను డీఈవో సన్మానించారు. అనంతరం హైదారాబాదు సంతోష్‌నగర్‌కు చెందిన భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి గుర్రం వెంకటేశ్వర్లు, సర్పంచ్ ఒగ్గు నగేశ్, వార్డు సభ్యుడు కరంటోతు రాజు, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, భారత్ వికాస్ పరిషత్ ఆర్గనైజర్ లక్ష్మీనర్సయ్య, ప్రెసిడెంట్ రాజేందర్, సెక్రటరీ లక్ష్మణ్‌రావు, రాచప్పసమితి అధ్యక్షుడు కృష్ణకుమార్, ప్రధానకార్యదర్శి సూరపల్లి వెంకటేశం, ముత్యాల చంద్రయ్య పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...