ఆసరా ప్రై ఆరా


Wed,June 19, 2019 12:45 AM

-సాయం రెట్టింపు చేసిన సర్కార్‌
-గ్రామాల్లో పుట్టగొడుగుల్లా పైరవీకారులు
-నిగ్గుతేలుస్తున్న నిఘా వర్గాలు
-బయటపడుతున్న అక్రమాలు
-జిల్లాలో 93,254 లబ్ధిదారులు
-ప్రతి నెలకు రూ 11,03,88,500 చెల్లింపు
-నిజమైన లబ్ధిదారుల్లో ఆనందం
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: అభాగ్యు ల పాలిట ‘ఆసరా’ పథకం వరంగా మారింది. టీఆర్‌ఎస్‌ సర్కా ర్‌ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత, చేనేత, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు, హెచ్‌ఐవీ రోగులకు పెన్షన్లు అందజేస్తున్నది. జిల్లాలో 93,254 లబ్ధిదారులకు ప్రతీ నెల రూ.11,03,88,500పై చిలుకు పంపిణీ చేస్తున్నది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నది. ఇచ్చిన హామీ మేర కు సీఎం కేసీఆర్‌ ఆసరా పెన్షన్లను రెట్టింపు చేశారు. జూలై నుంచి రూ.1000 ఉన్న పెన్షన్‌ రూ. 2016, రూ. 1500 ఉన్న దివ్యాంగుల పెన్షన్‌ రూ.3016 అందజేయనున్నారు. ఆసరా రెట్టింపుతో గ్రామాల్లో పైరవీకారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. అనర్హుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. ఆసరా పెన్షన్లు, నకిలీ బీడీ కార్మికుల వివరాలు బట్టబయలు చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంలో అక్రమార్కులను ఏరివేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

నిజమైన లబ్ధిదారులకు మేలు ...
దీంతో నిజమైన లబ్ధిదారులకు మేలు చేకూరనుండడంతో సం తోషం వ్యక్తం చేస్తున్నారు. ఆసరా లేని అభాగ్యులకు అండగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ లు చేస్తున్న ఆసరా పెన్షన్ల అక్రమాలు, అక్రమార్కుల గురించి పైరవీకారుల వివరాలపై నిఘావర్గాలు ఆరా తీస్తున్నాయి.ఇదే క్రమంలో పైరవీకారులు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం, పెన్షన్ల కోసం నిబంధనలకు విరుద్ధంగా దస్తావేజులను సృష్టించి లబ్ధిపొందుతున్న అక్రమార్కుల వివరాలు బయటపడుతున్న తీరు నిఘావర్గాలను, అధికార యంత్రాంగాన్ని నివ్వెరపరుస్తున్నాయి. యాదాద్రిభువనగిరి జిల్లా వ్యాప్తంగా 17 మండలాలు, 402 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 93, 254 మం దికి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, గీత, చేనేత, ఒంటరి మహిళలతో పాటుగా బీడీ కార్మికుల బోధకాలు గ్రస్తులకు పెన్షన్‌ అందిసున్నది. ప్రతి నెల రూ.11,03,88,500 లను ఆసరా పెన్షన్లలో భాగంగా జిల్లాలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.57 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతీ ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్‌ ఇవ్వడంతోపాటుగా బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, వింతతు, ఒంటరి మహిళలు, బోధకాలుగ్రస్తులకు న్యాయబద్ధంగా పెన్షన్‌ అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చినహామీని అమలు చేస్తున్నారు.

పుట్టగొడుగుల్లా పైరవీకారులు ...
ఇదే క్రమంలో జిల్లాలోని అన్ని మండలాల్లో పైరవీకారులు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చి ఆధార్‌కార్డులను మార్ఫింగ్‌ చేయించి అర్హతకు తగిన వయస్సును సరిచేయడం, కొన్నిచోట్ల బీడీ కార్మికుల పేరుతో పెన్షన్‌ ఇప్పిస్తామంటూ అనుమతులు లేని ప్రైవేట్‌ కంపెనీలు కార్మికుల వద్ద డబ్బులు వసూలు చేయడం, వికలాంగులకు తగిన పర్సంటేజీ లేనప్పటికీ పెన్షన్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నతీరు పైరవీకారుల పైస వసూళ్లు, అక్రమార్కుల వక్రబుద్ధి అభాగ్యులకు జరుగుతున్న అన్యాయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే పెన్షన్‌ పొందుతున్నవారిలో ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. విచారణలో ఇవన్నీ వెలుగుచూస్తుండడంతో నిఘావర్గాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. దీనికితోడు మండల, జిల్లా అధికారులు కూడా వెలుగుచూస్తున్న సాఫల్యవైఫల్యాలపై రకరకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్లు అర్హులకు కాకుం డా ఎక్కడైనా అనర్హులకు అందుతున్నాయా..? అనే విషయం లో కూడా ఆ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా పెన్షన్లు వస్తున్న సందర్భాలు వెలుగుచూస్తున్నట్లు సమాచారం.

క్రాస్‌ చెక్‌ చేసుకుంటున్న అధికారులు...
జిల్లాలోని అసరా పెన్షన్ల వ్యవహారంలో అక్కడక్కడ అనర్హులే పెన్షన్లు పొందడంలో ముందన్నట్లు భావిస్తున్నఅధికారగణం మరోసారి క్రాస్‌చెక్‌ చేసుకునే పయత్నంలో పడ్డారు. క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారులు పలుచోట్ల చేసిన తప్పిదాల వల్లే ఈ చిన్న చిన్న పొరపాట్లు జరిగి అక్కడక్కడ అనర్హులు, ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు పెన్షన్లు తీసుకున్న సందర్భాలు పొడచూపాయని, దీంతో ప్రభుత్వ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరడం లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకవెళ్లేలా నిఘావర్గాలు, అధికారవర్గాలు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలసింది. జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లను కలిపి 17 మండలాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలోకి వస్తాయి. మొత్తం జిల్లాలో 93,254 లబ్ధిదారులు ఉండగా వృద్ధులు 34, 652, వికలాంగులు 13,167, వితంతువులు 32,644, చేనేత కార్మికులు 3,261, గీత కార్మికులు 5683, ఒంటరి మహిళలు 2520, బీడీ కార్మికులు 898, ఫైలేరియా రోగస్తులు 429 మంది లబ్ధ్దిపొందుతున్నారు.

నిఘా వర్గాల సమాచారంపై ఆరా...
ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనర్హులు లభ్ధిపొందుతున్నారని నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమాచారం చేరవేస్తున్న సందర్భంలోనే పెరిగిన పెన్షన్లను ఎరగా వేస్తూ ప్రజలను మోసం చేసే క్రమంలో పైరవీకారులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అక్రమార్కులపై కొరఢా ఝళిపేందుకు అధికారయంత్రాంగం సిద్ధమవుతుండగా అర్హుడైన నిజమైన లబ్ధిదారుడి పెన్ష న్‌ అందాలని ప్రభుత్వం చెబుతున్నది. అదే క్రమంలో అక్రమార్కులపై కూడా దృష్టిసారిస్తున్నది. నిఘావర్గాలు, అధికారయంత్రాంగం ఆరా తీస్తుండడంతో దళారులు, పైరవీకారులు, అర్హతలేకుండా లబ్ధిపొందుతున్న పెన్షన్‌దారుల గుండెల్లో రైళ్లుపరిగెడుతున్నాయి.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...