ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి


Wed,June 19, 2019 12:41 AM

తుర్కపల్లి : ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను గొర్రెలు, మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ డాక్టర్‌ భాస్కరన్‌ అన్నారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని రుస్తాపూర్‌, పెద్దతండా, పల్లెపహాడ్‌, ధర్మారం గ్రామాల్లో వైద్య సిబ్బంది గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను వేశారు. రుస్తాపూర్‌లో 1293 గొర్రెలు మేకలు, పెద్దతండాలో 1190, పల్లెపహాడ్‌లో 3344 ధర్మారంలో 1028 గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులు వేసినట్లు డాక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ జనార్దన్‌ వైద్య సిబ్బంది గొర్రెల, మేకల పెంపకం దారులు ఉన్నారు.
యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేశారు. మంగళవారం మోటకొండూర్‌ మండల కేంద్రంలో రాష్ట్ర మానిటరింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి ఆధ్వర్యంలో జీవాలకు నట్టల నివారణ ముందులను వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నట్టల మందు వేయడం వలన కడుపులో ఉన్న నట్టలు పడిపోయి జీవం గట్టిగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవాల కోసం నట్టల మందులను ఉచితంగా పంపిణీ చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో పశువైద్యాధికారులు ఐలయ్య, శ్రీకాంత్‌, జేవీవో క్రాంతిరేఖ, పశుమిత్ర ఇందిర, గోపాల మిత్ర అనిల్‌, వేణు, గొర్రెల కాపర్ల సంఘం నాయకులు రేగు సిద్ధయ్య, బాల్ద సత్తయ్య, మల్గ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్టలో..
యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట గ్రామంలో గొర్రెలను ఉచితం నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ వంటేరు సువర్ణ పలు జీవాలను నట్టల మందులు వేశారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి నర్సింహులు, కురుమ సంఘం నాయకులు దశరథ, బాలరాజు, ఉప్పలయ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలతో లబ్ధిదారులకు మేలు..
ఆలేరుటౌన్‌ : ప్రభుత్వ పథకాలతో లబ్ధిదారులకు ఎంతో మేలు జరిగిందని అలేరు మండల జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్‌ అన్నారు. మంగళవారం నట్టల నివారణ ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆలేరు మండలంలోని పట్టణంలోని బహదూర్‌పేటలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను వేశారు. ఈ సందర్భంగా మండలంలోని 4746 జీవాలకు మందులు వేసినట్లు మండల వెటర్నరీ డాక్టర్‌ చైతన్య, డా.నవీన్‌ తెలిపారు. ఇందులో 3969 గొర్రెలకు, 777 మేకలకు మందులు వేశామన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో జిల్లా అబ్జర్వర్‌ డా.బి శ్రీదేవి, డా.ఐలయ్య, మండల వెటర్నరీ సిబ్బంది శివాజీ, స్వామి, రమ, శ్రవణ్‌, మండలంలోని పలు గ్రామాలకు చెందిన గొర్లకాపరుల సంఘం నాయకులు కిష్టయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
గొర్రెలకు నట్టల నివారణ మందులు వేయించాలి..
ఆత్మకూరు(ఎం) : ప్రభుత్వం పంపిణీ చేసిన నట్టల నివారణ మందులను గొర్ల కాపర్లు గొర్రెలకు తప్పనిసరిగా వేయించాలని మండల పశువైధ్యాదికారి సంతోశ్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు కూరెళ్లలో గొర్రెలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జన్నాయికోడె నగేశ్‌, ఎంపీటీసీ నర్సింహాచారి, గొర్ల కాపర్లు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...