గొర్ల కాపరుల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయం


Wed,June 19, 2019 12:41 AM

గుండాల : గొల్ల, కుర్మల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం గుండాల మండల కేంద్రంలో పశు వైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని గొర్ల కాపరులకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుగని విధంగా గొర్రెల కాపరుల కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొటేలును అందజేస్తుందన్నారు. గొర్ల సంక్షేమం కోసం వైద్య సేవలు కల్పించడంతో పాటు ప్రతి యేటా ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.అన్ని గ్రామాల్లోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి మదన్‌కుమార్‌, ఏడీ అయిలయ్య, ఎంపీపీ సంగి వేణుగోపాల్‌, జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, సర్పంచ్‌లు చిందం వరలక్ష్మి, రేఖ, పశు వైద్యాధికారులు యాకూబ్‌, వేణు, కో-ఆప్షన్‌ ఎండీ షర్పోద్దీన్‌, ఆల్డా ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ దశరథ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బడక మల్లయ్య, గొర్రెల కాపరుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...