సర్కారు బడుల్లో మెరుగైన విద్యాబోధన


Wed,June 19, 2019 12:41 AM

బొమ్మలరామారం : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యాబోధన అందుతుందని జిల్లా విద్యాధికారి రోహి ణి అన్నారు. మంగళవారం మండలంలోని జలాల్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా “స్వచ్ఛ పాఠశాల-హరితహారం” కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..యాదాద్రిభువనగిరి జిల్లాలోనే జలాల్‌పూర్‌ ఉన్నత పాఠశాలను స్వచ్ఛ పాఠశాలగా గుర్తింపు చేశామన్నారు. పూర్వ విద్యార్థులు,దాతల సహకారంతో పాఠశాలను కార్పొరేట్‌ స్థాయిని మించి వసతులను కల్పించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న హెచ్‌ఎం నాగార్జున కృషి అభినందనీయమన్నారు. పాఠశాల ఆవరణను ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దుకున్న గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛ పాఠశాలతో పాటు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ప్రతీ ఒక్కరూ మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచిపోషించాలన్నారు. పర్యావరణ రక్షణకు మొక్కలను నాటాలన్నారు. గ్రామస్తులను చైతన్యపరుస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వంతోపాటు దాత లు అందించే సాకారలతో విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదుగాలని ఆశించారు.

అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటి నీళ్లు పోశారు. అదేవిధంగా పాఠశాలలో మంచినీటి సదుపాయం కోసం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సనత్‌నగర్‌ తరుపున లయన్‌ సుజాతసూర్యరాజ్‌ దంపతులు బోరు మోటర్‌ కోసం రూ.80వేలు విరాళంగా అందజే సి, పాఠశాల అభివృద్ధికి దత్తత తీసుకున్నారు. పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 11మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసి, విద్యార్థులకు హెల్త్‌కిట్లు, నోట్‌ పుస్తకాలను పం పిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొల్లంపల్లి తిరుపతిరెడ్డి, నూతనంగా ఎన్నికైన ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, సర్పంచ్‌ సంగిశెట్టి వెంకటేశం, ఎంపీటీసీ మడిగె నర్సింహ్మ, ఎంఈఓ అంజయ్య, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సింగిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి, సెక్టోరియర్‌ అధికారులు బచ్చు లక్ష్మీనారాయణ, రఘురాంరెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ నాగరాజు, హెచ్‌ఎంలు పెండెం నాగార్జున, హిమబిందు, ఉపాధ్యాయులు రమణారావు, వెంకటనారాయణ, సునిత, శ్రీనివాస్‌, టీవీరావు, స్వామి, పీఈటీ నర్సింహ్మ, నాయకులు మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...