ప్రభుత్వ దవాఖానలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం


Wed,June 19, 2019 12:41 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ ఏరియా దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పించి పేదలకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు చేపడుతామని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఏరియా దవాఖానాలో జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కలిసి దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానలు.. ప్రైవేట్‌కు ధీటుగా నడుస్తున్నాయని, ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చలవేనన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాల లేమి లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నారని, ప్రతిఒక్కరూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు. ఏరియా దవాఖానలో రోగులకు సరైన రీతిలో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా దవాఖాన నిర్వహణ చేపట్టాలన్నారు. దవాఖాన అన్ని రకాలుగా అభివృద్ధి జరిగేలా పనులు వేగవంతం చేస్తామన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమను సంప్రదించి అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. అంతకుముందు దవాఖానలోని అన్ని వార్డుల్లో పర్యటించి వైద్య సదుపాయాలు, తదితర మౌలిక వసతుల కల్పన, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్నిపల్‌ చైర్‌ పర్సన్‌ నువ్వుల ప్రసన్న, డీఎంహెచ్‌వో సాంబశివరావు, డీసీహెచ్‌ఎస్‌ కోట్యానాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ అమరేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...