బీసీ గురుకులాలుప్రారంభం


Mon,June 17, 2019 11:18 PM

-బొమ్మలరామారం మండలం చీకటిమామిడి, బీబీనగర్‌లలో ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
-హాజరైన ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి
-ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బొమ్మలరామారం: బీసీల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చీకటిమామిడి ప్రొగ్రెసివ్ ఇంజినీరింగ్ కళాశాల భవనంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీ విద్యార్థులకు విద్యావకాశాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సికింద్రాబాద్, యాకుతుపూర, సనత్‌నగర్, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన బీసీ విద్యార్థుల సంక్షేమం కోసం బొమ్మలరామారం మండలంలో ఈ పాఠశాల ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో గురుకుల పాఠశాలలో 5,6,7తరగతులకు 240 మంది విద్యార్థుల చొప్పున ప్రవేశాలను కల్పిస్తున్నామన్నారు. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు ఏర్పాటు చేసి విద్యాబోధన జరుగుతుందన్నారు. బీసీలకు కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున ఖర్చును ప్రభుత్వం భరిస్తుందన్నారు.

గురుకుల పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. మిషన్ భగీరథ ద్వారా పాఠశాలకు తాగునీటి సదుపాయాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలేరు నియోజకవర్గం బీసీ బాలుర గురుకుల పాఠశాల రాజాపేట మండలానికి కేటాయించినప్పటికీ సరైన వసతులతో కూడిన భవనాలు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా బొమ్మలరామారం మండలంలో ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జేసీ రమేశ్, ఆర్డీవో సత్యనారాయణ, బీసీ సొసైటీ ఏజీవో కేశవులు, ఓఎస్‌డీ లక్ష్మీనారాయణ, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి యాదగిరి, జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు, ఎంపీపీ బొల్లంపల్లి తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మర్రి జయమ్మాకృష్ణారెడ్డి, ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, ఎంపీటీసీలు మచ్చ శ్రీనివాస్‌గౌడ్, ధీరావత్ పాచ్యానాయక్, సర్పంచ్ వసంతాగౌడ్, ప్రిన్సిపాల్ చక్రపాణి, తహసీల్దార్ పద్మసుందరి, ఎంపీడీవో సరిత, నాయకులు పొలగౌని వెంకటేశ్‌గౌడ్, రాగుల బలరాం, మాజీ జడ్పీటీసీ చీర్ల రాజేశ్వర్, శ్రీనివాస్‌రావు, చంద్రమౌళి, జమాలుద్దీన్, సుధాకర్‌రెడ్డి, నర్సింహ, పాండు ఉన్నారు.


బీబీనగర్‌లో..
బీబీనగర్ : తెలంగాణ ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్ బాటలు వేస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలోని టీడీఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీసీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్సీ కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సమావేశాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గురుకులాలను బలోపేతం చేస్తుందన్నారు. గురుకుల విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు, దుస్తులు అందజేస్తుందన్నారు. ఆడపిల్లల కోసం కాస్మోటిక్ ఖర్చులను అందస్తుందన్నారు.

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యాభోదనతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ఈ సందర్భంఆ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యాక్రమాలు అలరించాయి. పాఠశాల ఆవరణలో ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మొక్కలను నాటి నీరు పోశారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, జడ్పీటీసీ సందిగారి బస్వయ్య, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, ఎంపీటీసీ పంజాల వెంకటేశ్‌గౌడ్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంఈవో నాగవర్దన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి, ఎంపీపీ ఎరుకల సుధాకర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల పార్టీ అద్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, కార్యదర్శి పంజాల సతీశ్‌గౌడ్, కోఆప్షన్ మెంబర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు మంగ అశోక్ పాల్గొన్నారు.

వాటర్ ఫిల్టర్ ఏర్పాటుకు హామీ..
పాఠశాలలో తాగునీటి వసతి లేదని, బయటి నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందని పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి తెలిపారు. వెంటనే స్పందించిన విద్యార్థుల సౌకర్యార్థం తన సొంత ఖర్చుతో రెండు మూడు రోజుల్లో వాటర్ ఫిల్టర్‌ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయనకు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...