డాక్టర్లపై దాడికి నిరసనల వెల్లువ


Mon,June 17, 2019 11:16 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : డాక్టర్లపై దాడులు చేస్తున్న వారిని అరెస్ట్ చేసి నాన్‌బెయిల్ వారెంట్ జారీ చేయాలని యాదాద్రి జిల్లా ఐఎంఏ బ్రాంచ్ అధ్యక్షుడు డా. ముడుండై గిరిధర్, వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జడల అమరేందర్‌లు డిమాండ్ చేశారు. ఐఎంఏ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని దవాఖానలు, మెడికల్ షాపులు స్వచ్ఛందంగా సోమవారం వైద్యులు భువనగిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని నిరసన పాటించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ భువనగిరి, యాదగిరిగుట్టలోని అన్ని మెడికల్ షాపులు, నర్సింగ్‌హోంల యాజమాన్యాలు బంద్‌లో పాల్గొన్నాయని తెలిపారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సమాజంలో కొంత మంది వైద్య వృత్తి ని అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్లకు కనీస భద్రత లేకుండా పోయిందని వాపోయారు. కలకత్తాలో ఇటీవల జరిగిన దాడి డాక్టర్లకు ఎంతమేరకు రక్షణ ఉందో తేటతెల్లం చేస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి డాక్టర్లకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. డాక్టర్లపై దాడులకు పాల్పడుతున్న వారిపై నాన్‌బెయిల్ వారెంట్ జారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమలో ఐఎంఏ కార్యదర్శి డా. ఎన్ వంశీకృష్ణ, కోశాధికారి డా. తాడూరి కృష్ణచైతన్య, రైటైర్డ్ డిప్యూటీ డీహెంఎచ్‌వో డా. వల్లాల అమరేందర్, సీనియర్ డాక్టర్లు కె.రాధాకృష్ణమూర్తి, ఎన్ ప్రసాద్, అమిరోద్ద్దీన్, ఎన్ ప్రసాద్, వానవ్, డా. మోహన్, అంజన్‌కుమార్, విజయ్‌భార్గవ్, జనార్దన్‌రెడ్డి, అనసూయ, పద్మజ, గీత, ప్రశాంతి, కిరణ్మయి, అనీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...