యాదాద్రిలో పరమశివుడికి రుద్రాభిషేకం


Mon,June 17, 2019 11:16 PM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి సోమవారం రుద్రాభిషేకం నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్త జనులు పరవశంతో పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ రుద్రాభిషేకంలో సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో మమేకం అయ్యారు. ఉదయా న్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివున్ని విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు. ప్రభాతవేళ జరిగే రుద్రాభిషేకంలో పాల్గొని శివుడిని ఆరాధించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శుభం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. శివాలయం ఉప ప్రధా న పురోహితులు గౌరీబట్ల నర్సింహరాములుశర్మ ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ నిర్వహిం చా రు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. శ్రీలక్ష్మీనరసింహుని బాలాలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహాయాగములో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు నిత్య కల్యాణోత్సవం జరిపించారు.

బంగారు దశావతారాల హారం బహూకరణ...
యాదాద్రిలో స్వామి వారికి రూ.11లక్షల విలువజేసే 336 గ్రాముల బంగారు దశావతారాల హారాన్ని సికింద్రాబాద్‌కు చెందిన ఉప్పు మనోహర్ రేణుక దంపతులు బహూకరించారు. ఆలయ ఈవో ఎన్. గీత, ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ ఏఈవో మేడిశివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి ఖజానాకు రూ.13, 66, 512 ఆదాయం...
శ్రీవారికి ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 98, 816, ప్రసాద విక్రయాలతో రూ. 6, 268, 810, విచారణ శాఖతో రూ. 76,800, తో పాటు అన్ని విభాగాల నుంచి రూ. 13, 66, 512 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆదాయశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో మేడి శివకుమార్, పర్యవేక్షకులు సండ్ర మల్లేశ్, బాలాజీ, సార నర్సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...