విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ


Mon,June 17, 2019 11:16 PM

భూదాన్‌పోచంపల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ కోట విజయభాస్కర్‌రెడ్డి ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత బోధన మాత్రమే ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. పేద విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా నాణ్యమైన ఉచిత విద్యతోపాటు ఉచిత పాఠ్యపుస్తకాలను సైతం అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల గ్రంథాలయ అధికారి కె.రామానంధం, బోధన సిబ్బందితోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...