నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి


Mon,June 17, 2019 11:16 PM

భూదాన్‌పోచంపల్లి : ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి రావుల అనిల్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం తహసీల్దారు గుగులోతు దశరథ నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ మండలంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని, యాజమాన్యం.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తుందన్నారు. స్కూల్లో పిల్లలకు డ్రెస్‌లు, షూజ్, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బెల్టులు అవసరం లేకున్నా బలవంతంగా కొనిపిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లలో ఏ ఒక్క టీచర్‌కు కూడా కనీస విద్యార్హతలేదని ఇంటర్, టెన్త్ ఫెయిల్ అయిన వారితో విద్యాభోదన చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనతోపాటు పెద్దల సన్ని, కుక్క అరుణ్, ప్రకాశ్, శ్రీకాంత్, వంశీ తదితరులు ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...