ప్రజావాణితో సమస్యలు పరిష్కారం


Mon,June 17, 2019 11:16 PM

భువనగిరి, నమస్తేతెలంగాణ : ప్రజావాణితో సమస్యలు పరిష్కారమవుతాయని జాయింట్ కలెక్టర్ రమేశ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆర్జిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎలాంటి సమస్యలున్నా సత్వరమే పరిష్కారమయ్యేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్జిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో వెంకట్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

మినీ గోదాం ఏర్పాటు చేయాలి..
మండలంలోని పెంచికల్‌పహాడ్ గ్రామంలో మినీ గోదాం ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ సిలువేరు పుష్పాఎల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం జాయింట్ కలెక్టర్ రమేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పదేండ్లుగా ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్ల్లు చేపడుతున్నారని, గ్రామంలోని సర్వే నెంబర్ 27లోని గ్రమకంఠం భూమిలో మినీ గోదాం ఏర్పాటుకు చర్యలు చేపట్టి రైతులకు ఇబ్బందులు తొలగించాలన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...