టీఆర్‌ఎస్ కార్యకర్త బాలయ్య గుండెపోటుతో మృతి


Mon,June 17, 2019 11:15 PM

భూదాన్‌పోచంపల్లి : మండలంలోని భీవనపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త గజ్జి బాలయ్య(47) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కరుడుకట్టిన తెలంగాణవాదిగా ఉద్యమంలో కీలకపాత్ర వహించడంతోపాటు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మృతుడు బాలయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలయ్య మృతి పార్టీకి తీరని లోటన్నారు. అతని కుటుంబాన్ని అన్ని విధులా ఆదుకుంటామని తెలిపారు. బాలయ్య మృతదేహానికి నివాళులర్పించిన వారిలో ఎంపీపీ సార సరస్వతీబాలయ్యగౌడ్, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధార్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు కందాడి భూపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ యాట కైలాసం, మాజీ ఎంపీటీసీ కొమ్ము సురేశ్, టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పాండు, వెంకటేశ్, స్వామి, శ్రీనివాస్, సిల్వేరు శేఖర్ తదితరులు ఉన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...