స్కూల్ బస్సుల్లో భద్రతెంత..!


Sun,June 16, 2019 11:41 PM

తల్లిదండ్రులూ ఆలోచించండి.. పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించామని సంతోషించడం కాదు. వారు నిత్యం ప్రయాణించే వాహన సామర్ధ్యం ఎలా ఉందన్నది కూడా పరిశీలించాలి. విద్యా ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయని ఒకటికి రెండుసార్లు తెలుసుకుంటున్నారు కానీ పాఠశాలకు చెందిన బస్సు ఏ కండీషన్‌లో ఉందన్న విషయాన్ని మాత్రం వదిలేస్తున్నారు. పిల్లల చదువు ఎంత ముఖ్యమో.. వారిని పాఠశాలకు చేర వేసే బస్సు భద్రత కూడా అంతే ప్రాధాన్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాఠశాల బస్సు సామర్ధ్యం సక్రమంగా ఉందా... కాలంచెల్లిన బస్సులనే వినియోగిస్తున్నారా..? అన్న విషయాలపై పెద్దగా శ్రద్ధచూపడం లేదు. రవాణాశాఖ అధికారులు ఒక్కరే దీనికి బాధ్యులుకాకుండా తల్లిదండ్రులు తమ కర్తవ్యంగా భావించాలి. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించి సామర్ధ్యం పరీక్షలు ముగించామన్నది కాకుండా రవాణాశాఖ అధికారులు ఏ మాత్రం లోపాలున్నా వెంటనే ఆ వాహనాలను పక్కనపెట్టాలి. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులను చేరవేసే చాలా బస్సులు అసలు నిబంధనలు పాటించకుండానే రోడ్డుపై నడుస్తున్నాయి. ప్రతిఏటా విద్యాసంస్థలకు చెందిన బస్సులకు సామర్ధ్యం పరీక్షలు నిర్వహిస్తున్న రవాణాశాఖ అధికారులు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆనుమతిలిస్తే బాగుంటుంది. కానీ ఎన్ని బస్సులు కండీషన్‌లో ఉన్నాయి, రవాణాశాఖ అధికారులు సామర్ధ్యం పరీక్షల్లో అనుమతి ఇచ్చిన బస్సులు ఎందుకు ప్రమాదాలకు గురవుతున్నాయి, కనీస భద్రత చర్యలు పాటించకుండా ఎన్ని బస్సలు విద్యార్థులను పాఠశాలలకు చేరవేస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి. ప్రతిఏటా పాఠశాలల ప్రారంభంలో జరుగుతున్న తంతే. ఈసారైన విద్యాసంస్థల బస్సులను ప్రత్యేకశ్రద్ధతో సామర్ధ్య పరీక్షలు నిర్వహించి అన్ని సక్రమంగా ఉన్న వాటికే అనుమతిస్తే విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం చూపినట్లవుతుంది.

అధికారులు కాసులకు కక్కుర్తిపడకుండా పూర్తిస్థాయిలో సామర్ధ్యం పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు జారీచేయాలని పలువురు కోరుతున్నారు. మళ్లీ చేసిన తప్పులే చేయకుండా జాగ్రత్తలు తీసుకుని సరైన సామర్ధ్యం, భద్రత చర్యలు పాటించే బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ పరీక్షల్లో అనుమతిస్తే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్లువుతుంది.
నిబంధనలు పాటించని యాజమాన్యాలు
బడిబస్సులకు పైన చూపించిన విధంగా నిబంధలను ఉండాలని ప్రభుత్వం ఆదేశించినప్పటకి పాఠశాలలు, కళాశాలల యజామన్యాలు పట్టించుకోవడం లేదు. తూతూమంత్రంగా బస్సుల పనులను చేయిస్తూ చేతులు దులుపుకుంటుంది. కొన్ని బస్సులకు అద్దాలు ఉండవు.. అద్దాలు ఉంటే జాలీలు ఉండువు. నిత్యం ఏ ప్రమాదం జరుగుతుందోనని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చాలా బస్సుల్లో విద్యార్థులు కూర్చోవడానికి సరైన విధంగా సీట్ల్లును ఏర్పాటుచేయడం లేదు. స్కూల్ బ్యాగ్‌లు పెట్టుకోవడానికి సీట్ల కింద ర్యాక్స్ లేక చిన్నారులు పుస్తకాల బ్యాగులను మీదనే పెట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారైన బస్సులకు అన్ని ఉంటేనే అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
పరిమితికి మించి విద్యార్థులు
పాఠశాలల స్కూల్ బస్సుల సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది చిన్నారులకు సీట్లు లేక బస్సులో నిలబడి పాఠశాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణశాఖ అధికారులు చూసి కూడా మాముళ్ళకు కక్కుర్తిపడి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బస్సు సీటింగ్‌కు మించి విద్యార్థులను ఎక్కించుకునే బస్సులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కాసులకు కక్కుర్తిపడుతున్న అధికారులు
రవాణశాఖ కాసులకు కక్కుర్తిపడి బస్సు సామర్థ్యంను పరీక్షించకుండానే అనుమతులు ఇస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. స్కూల్ బస్సుకు పైన చెప్పిన విధంగా నిబంధనలు పాటించాలని ప్రభుత్వ ఆదేశాలున్నప్పటికి కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి నిరుపయోగంగా మారి పోతున్నాయి. వారి నిర్లక్ష్యం కారణంగా స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురై కొంతమంది చిన్నారుల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలు జరిగినప్పడే కాకుండా నిత్యం విద్యాసంస్థల బస్సులపై పర్యవేక్షణ ఉండాలని పలువురు కోరుతున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
ఫిట్‌నెస్ ఉన్న బస్సులను మాత్రమే పాఠశాల యాజమాన్యం నడపాలి. ఫిట్‌నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడిపితే బస్సులను వెంటనే సీజ్ చేసి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనలు ప్రతి పాఠశాల యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలి.
- సి. మధుసూదన్‌రెడ్డి,
సూర్యాపేట జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి

స్కూల్‌బస్సుకు ఇవి తప్పనిసరి
-బస్సులో విధిగా హ్యాండ్ బ్రేక్ ఉండాలి
-బస్సు పైభాగంలోని రూఫ్ బాగుండాలి. బస్సు టైర్లు, ఇతర పరికరాలు ఎప్పటికప్పడు మారుస్తూ ఉండాలి. బస్సు స్టీరింగ్ చక్కగా ఉండాలి.
-బస్సులో అత్యవసర ద్వారం తప్పనిసరి. అంతేకాదు అత్యవసర ద్వారం ఉన్న చోట అందంరికీ కన్పించేలా పెద్దగా రాయాలి. అత్యవసర సమయాల్లో అద్దాలు పగులగొట్గడానికి వీలుగా సుత్తిలాంటి పరికం ఉండాలి.
-బస్సుకు కుడివైపున ముందుభాగంలో వెనుక వస్తున్న వాహనాలను గమనించేందుకు సైడ్ మిర్రర్(అద్ధం) విధిగా ఉండాలి.
-పిల్లలు బస్సు కిటికీల్లోంచి తలులు బయటకు పెట్టుండా కిటికీలకు ఇనుప ఊచలు అమర్చాలి.
-బస్సు ముందు, వెనుక భాగంలో పసుపు, ఎరుపు స్టిక్కర్లను అంటించాలి. బస్సులో పిల్లలను ఎక్కించేటపుడు, దించేటప్పుడు ఇండికేటర్లు వెలుగుతూ ఉండాలి.
-బస్సు నాలుగువైపులా పైభాగంలో అంబర్‌ఫ్లాషింగ్ లైట్లు ఏర్పాటుచేయాలి.
-బస్సు ఫుట్‌బోర్డు వద్ద పిలలు ఎక్కేందుకు వీలుగా మొదట మెట్టు కిందికి ఉండాలి. పాఠశాలకు చెందిన వ్యక్తిగత సహాయకుడిని నియమించి పిల్లలను బస్సు ఎక్కిండం, దించుకోవడం చేయాలి.

డ్రైవర్ ఇది పాటించాలి
-బస్సు నడిపే డ్రైవర్ వయస్సు 60సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ప్రతి మూడునెలలకు ఒకసారి డ్రైవర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలి. బీపీ, మధుమేహం ఉంటే వాటకి సంబంధించి ఆరోగ్యపట్టికను నిర్వహించాలి.
-బోధకుని లైసెన్సు రవాణాశాఖ అధికారుల వద్ధ ధ్రువీకరించుకోవాలి.
-ఒకే కేటగిరి వాహనాన్ని ఐదేళ్లు నడిపిన డ్రైవర్‌కు అదే వాహనాన్ని కేటాయించాలి.
-ప్రతి ఏడాది రవాణాశాఖ నిర్వహించే పునశ్చరణ తరగతులకు డ్రైవర్ హాజరు కావాలి.
-ప్రతిరోజు ఉదయం చోదకునికి బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించిన తరువాతనే బస్సు అప్పగించాలి.
-ప్రతి బస్సులో ఒక అటెండర్ తప్పకుండా ఉండాలి.
- డ్రైవర్, అటెండర్‌కు ఏకరూప దుస్తులు తప్పనిసరి.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...