గుట్టలో నేటి నుంచి లక్ష్మీహయగ్రీవుడి బ్రహ్మోత్సవాలు


Sun,June 16, 2019 11:39 PM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదగిరిగుట్ట పట్టణంలోని వేదపాఠశాలలో శ్రీలక్ష్మీహయగ్రీవస్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం స్వామివారి సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వస్తివాచనం, మృత్సంగ్రహణ అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 19న ఎదుర్కోలు, 20న శ్రీలక్ష్మీహయగ్రీవుడి కల్యాణమహోత్సవం, 21న రథోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు వార్షిక బ్రహోత్సవాలు న్విహిచేందుకు సకల ఏర్పాట్లు చేశారు. సోమవారం వేద కళాశాలలో వేయి దేవతామూర్తులను ఆవాహన చేసి, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, బెల్లం, వటవేళ్లు, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, మూర, శైలేయం, చంపకం, వజ, పచ్చకర్పూరం, గంద కచూరాలు మొదలగు వాటితో పంచసూక్తములు, దశశాంతులు, పంచోపనిషత్తులు, వేదానువాకం, నాదస్వర, గీతికలు, నడుమ అపరిమిత కోలాహలంగా, శ్రీవైష్ణవ సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ తంతు జరుగనున్నది. అనంతరం స్వామిని నూతన పట్టువస్ర్తాలు, వివిధ వర్ణపుష్ప మాలికలతో అలంకరించి, మహా నైవేద్యం పెట్టి మంగళహారతులు ఇవ్వనున్నారు. ఆదివారం విద్యార్థుల నాలుకపై బీజాక్షరాలు, ఆచార్య సమాశ్రమయణాలు, అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహక వర్గం నల్లందీగల్ విజయలక్ష్మీ, శ్రీ సౌమ్య, ధర్మ ప్రణతాచార్యులు యాద ఫణీంద్రచార్యులు, సీతామనోహరాచార్యులు, వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...