సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ కల్పించడం హర్షణీయం


Sun,June 16, 2019 11:38 PM

మోత్కూరు : నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించి గెజిట్ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. పంచాయతీరాజ్ చట్టం 2018లో చెక్ పవర్‌కు సంబంధించిన సెక్షన్లపై నోటిపై చేస్తూ కొన్ని నూతన సెక్షన్లను చేర్చి ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇది నేటి నుంచి అమలులోకి రావడం పట్ల అటు సర్పంచ్‌లు, ఇటు ఉపసర్పంచ్‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గ్రామ పంచాయతీల్లోని ఆదాయ, వ్యయాలపై నిర్వహించే ఆడిటింగ్ బాధ్యతలను ప్రభుత్వం సర్పంచ్‌లతోపాటు పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. సీఎం కేసీఆర్ న్యాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ పాలనను అందించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తుందని పలువురు ప్రశంసిస్తున్నారు.

ప్రభుత్వం చెక్ పవర్ కల్పించడం అభినందనీయం..
సంస్థాన్‌నారాయణపురం : సర్పంచ్‌తోపాటు ఉపసర్పంచ్‌లకు ప్రభుత్వం జాయింట్ చెక్ పవర్ కల్పించడం అభినందనీయమని వెంకంబావితండా సర్పంచ్ పానుగోతు పాండురంగానాయక్, కంకణాలగూడెం ఉపసర్పంచ్ కడ్తాల కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక నుంచి గ్రామాల్లో అభివృద్ధి వేగవంతంగా అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధ్యం కానుందన్నారు.

గ్రామాలాభివృద్ధిలో భాగస్వాములవుతాం..
అడ్డగూడూరు : సర్పంచ్‌లతోపాటు తాము కూడా గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతామని ఉపసర్పంచ్ వడకాల రణధీర్‌రెడ్డి అన్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చెక్‌పవర్‌తో ఉపసర్పంచ్‌లకు బాధ్యత పెరిగిందని తెలిపారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...