సాగర్‌లో పర్యాటకుల సందడి


Sun,June 16, 2019 11:36 PM

నందికొండ : ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌లో ఆదివారం విద్యార్థులు, ఉద్యోగులు, విదేశీ పర్యాటకులు సందర్శించడంతో సాగర్‌లో పర్యాటకులతో సందడి వాతావరణ నెలకొన్నది. నాగార్జునకొండలో బుద్దుని జీవితగాథలకు సంబంధించిన శిల్పాలను పొందుపరిచిన ఆర్కియాలజీ మ్యూజియంను సందర్శించడానికి తెలంగాణ టూరిజం ఏర్పాటుచేసిన లాంచీలో నది మార్గంలో నాగార్జునకొండకు వెళ్ళుటకు పర్యాటకులు ఉత్సాహం కనబర్చారు. నాగార్జునకొండకు లాంచీలో ప్రయాణం ఆహ్లాదంగా ఉందని, నాగార్జునకొండలో యజ్ఞశాల, ఎత్తైన బుద్దుని విగ్రహం, అశ్వవేదయాగశాల, ఇటుకలతో ఏర్పాటుచేసిన స్వస్తిక్ గుర్తు, అలనాటి నదీలోయ నాగరికతలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలు తెలుసుకోవడం బాగుందని పర్యాటకులు తెలిపారు. శ్రీపర్వతారామం(బుద్దవనం)లోని గోపురంపైన, మ్యూజీయంలో అమర్చిన శిల్పాలను, స్థూపపార్కు, ఉద్యానవనం, బుద్దచరితవనం, మహాస్థూపపార్కు ప్రాంతాల్లో పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొన్నది. తెలంగాణ టూరిజం నాగార్జునకొండకు ఆదివారం లాంచీలు నడపడంతో రూ. 16,000 ఆదాయం వచ్చిందని లాంచీస్టేషన్ మేనేజర్ గంగరామ్ తెలిపారు. విహారయాత్రలకు వచ్చే విద్యార్థులు, పర్యాటకులు, విదేశీయులతో సాగర్ పర్యాటక ప్రాంతాలైన లాంచీస్టేషన్, బుద్దవనం, దయ్యాలగండి, డ్యాం పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...