తీపి కబురు..!


Sun,June 16, 2019 12:25 AM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : అసైన్డ్‌ భూముల్లో కాస్తులో ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది. కాస్తులో ఉన్న అన్నదాతలందరికీ పట్టాల జారీకి సుముఖత వ్యక్తం చేసింది. జిల్లాలో మొత్తం ఎకరాల 43, 647.34 గుంటల భూమి రైతుల చేతులో ఉం ది. అయితే మండల కేంద్రానికి 5 కిలో మీటర్ల పరిధి దాటిన భూములకు పట్టాలు పంపిణీ చేస్తారు. ఐదుకిలోమీటర్లలోపు వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దీనిపై రెవెన్యూశాఖకు ఉన్నతాధికారుల నుంచి అదేశాలు అందాయి. అసైన్డ భూములను కొనుగోలు చేసిన రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మేము నిరుపేదలం.. పట్టుమని పది గజాల వ్యవసాయ పొలం లేదు. ప్రభుత్వం భూమిని కొంత అసైన్‌ చేస్తే ఆ భూమిలో పంటలను సాగు చేసుకుంటూ మా కుటుంబాలను పోషించుకుంటాం.. అంటూ అధికారులు వీలు ను బట్టి భూమిలేని వారికి ప్రభుత్వ భూములను అసైన్డ్‌ చేశా రు. ఇలా చేసిన వాటిలో పూర్తిస్థాయిలో భూమి పొందిన రైతు లు ఉంటే వారికి సాదాబైనామా ద్వారా నూతన పాసు పుస్తకాలను ప్రభుత్వం అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లోని ఆయా గ్రామాల్లో చాలా మంది రైతులు వారికి ప్రభుత్వం భూమి అసైన్డ్‌ చేయగా ఇతరులకు విక్రయించుకుని పబ్బంగా గడుపుకున్న వారు ఉన్నారు. ఈ క్రమంలో ఈ భూములను కూడా ప్రభుత్వం ఎవరైతే కాస్తులో ఉన్నారో వారి వివరాలను సేకరించి వారు సాగు చేసుకుంటున్నా భూముల వివరాలను పరిగణలోకి తీసుకుని నమోదు చేసుకుని వారికే నూతనంగా డిజిటల్‌ పాసు పుస్తకాన్ని అందజేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అసైన్డ్‌ భూముల వివరాలను సేకరించిపనిలో నిమగ్నమయ్యారు.

జిల్లాలో 43, 647.34 ఎకరాల్లో అసైన్డ్‌భూమి...
ప్రభుత్వ భూములను జిల్లా వ్యాప్తంగా ఎవరికైతే కేటాయించి వారికీ పట్టాలు ఇవ్వని వివరాలను పక్కాగా సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో గతంలో అందించిన లబ్ధిదారుల స్థానంలో ఇతరులు ఎవరైనా భూముల్లో కాస్తు చేస్తుంటే వారికే పట్టాలు చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో కాస్తుదారులకు మేలు చేకూరనున్నది. గతంలో అసైన్డ్‌ భూములను ఎవరూ కొందరు రైతుల విక్రయాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో కాస్తులో ఉన్నవారికి ఈ భూ ములను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోజిల్లా వ్యాప్తంగా --మంది రైతులకు గతం లో అసైన్డ్‌ భూమిని ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మొత్తం 43, 647.34 ఎకరాల భూమి పీవోటీ స్థానంలో ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ భూములను మరోసారి సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి కాస్తుదారులకు పట్టాలను జారీ చేసేందుకు నివేదికలకు జిల్లా ఉన్నతాధికారులను నివేదించాలని జిల్లా ఉన్నత అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. భువనగిరి డివిజన్‌లో 27874. ఎకరాల1373 గుంటల భూమి ఉంది.అదేవిధంగా చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్‌లో 15, 707 ఎకరాల 1301 గుంటల అసెన్డ్‌ భూమి ఉన్నట్లు అధికారులు తేల్చారు.

మండల కేంద్రానికి 5 కి. మీ. దూరంలో ఉండాల్సిందే...
ఏ మండల కేంద్రానికైనా సరే 5కిలో మీటర్ల దూరంలోపు ఉన్న భూములను తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటుంది. 5 కిలో మీటర్లు దాటి ఉన్న భూములను మాత్రమే నిబంధనల మేరకు కాస్తులో ఉన్నవారికీ నూతన పాసుపుస్తకాలు అందించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. మండల కేంద్రానికి 5 కి.మీ పరిధిలో అసైన్డ్‌ భూముల పీవోటీ(అసైన్డ్‌ చేసిన వారు కాకుండా భూమిలో ఇతరులు ఉన్నట్లయితే) పరిధిలో ఉన్న భూములను మండల కేంద్రం అభివృద్ధిలో భాగంగా ఈ భూ ములను అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. ఈ క్రమంలో అసైన్డ్‌ భూముల్లో పీవోటీ పరిధిలో ఉన్న రైతులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతో మేలు జరగనున్నది.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...