ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుధ్యం


Sun,June 16, 2019 12:23 AM

గుండాల : గ్రామ పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు అయినప్పుడే గ్రామం అన్ని రకాలుగా పారిశుద్ధ్యంలో అభివృద్ధి చెందుతుందని గంగాపురం గ్రామ సర్పంచ్‌ దార సైదులు అన్నారు. శనివారం మండలంలోని గంగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామం నూటికి నూరు శాతం సంపూర్ణ పారిశుధ్యం సాధించాలంటే ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అన్నారు. గ్రామంలో పారిశుధ్యంతో పాటు తాగునీటి సమస్య పరిష్కరించడం కోసం ప్రణాళికలు రూపొందించుకొని గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యులు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ బడి బాట కార్యక్రమంలో భాగంగా పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ గార్లపాటి సోమిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి విజయ, ఉప సర్పంచ్‌ మంజూల, వార్డు సభ్యులు దయ్యాల మాధవి, ఎ.అశ్విని, ఎండీ యాకూబ్‌, ఎ.సోమయ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అంజయ్య, అంగన్‌వాడి సిబ్బంది చంద్రగిరి యాదలక్ష్మి, ఆశ కార్యకర్తలు ఫరీదా, ఎండీ అలీమ్‌, సోమన్న, వెంకన్న, జగన్‌, రమేశ్‌, నాగరాజు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...