అరాచక శక్తుల ఆటకట్టిస్తాం : డీసీపీ నారాయణరెడ్డి


Sun,June 16, 2019 12:23 AM

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ : అరాచకశక్తుల ఆటకట్టిస్తామని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. తంగడపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంతంలో డీసీపీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఇంటింటికకీ తిరిగి పోలీసులు జల్లెడ పట్టారు. 5గురు సీఐలు, 15 మం ది ఎస్సైలు లతో పాటు 120 మంది పోలీస్‌ సిబ్బంది కార్డన్‌సెర్చ్‌లో పాల్గొన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువీకరణపత్రాలను లేని 44 బైక్‌లు, కారు, నా లుగు ఆటోలు సీజ్‌ చేశారు. ఐదు బెల్ట్‌షాపులపై రైడ్‌ చేసి రెండు ఫుల్‌బాటిల్లు, రెండు క్వాటర్‌ బాటిల్లు,144బీర్‌సీసాలు స్వాధీనం చేసుకున్నా రు. తంగడపల్లి మొత్తాన్ని పోలీసులు తమ గు ప్పెట్లోకి తెచ్చుకున్నారు. అకస్మాత్తుగా పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ చేపట్టడంతో ఏం జరుగుతుంతో తెలియక కొంత సేపు ప్రజలు ఆందోళనకు గురయ్యా రు. కార్డన్‌ సెర్చ్‌ చేపడుతున్నారని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డీసీపీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అన్ని గ్రామా ల్లో కార్డన్‌ సెర్చ్‌ చేపడుతామని తెలిపారు. సంఘవిద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు పోలీస్‌శాఖ అన్ని చర్యలను చేపడుతుందన్నా రు. కార్డన్‌ సెర్చ్‌ అకస్మాత్తుగా చేపడుతామని తెలిపారు. ప్రశాం త వాతావరణంలో యువత నడుచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ సత్త య్య, సీఐ వెంకటేశ్వర్లు,నర్సింహరావు, సురేందర్‌రెడ్డి, మంజుల, రంగనాయకులు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...