పేదలకు అండగా ఉన్నవాడే నిజమైన నాయకుడు


Sun,June 16, 2019 12:23 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ : పేద ప్రజలకు అండగా ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వారే నిజమైన నాయకుడు, ప్రజా సేవకుడని భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అంజుమాన్‌ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఏ ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన ఈద్‌ మిలాప్‌ కార్యక్రమం సందర్భంగా అంజుమాన్‌ సొసైటీ అధ్యక్షుడు రహీం అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. హిందూ ముస్లింలు సోదరభావాన్ని కలిగి ఉండి కలసి కట్టుగా ముందుకుసాగాలన్నారు. పవిత్ర రంజాన్‌ మాసం అనంతరం నిర్వహించుకునే ఈద్‌ మిలాప్‌ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుదన్నారు. ముస్లింల సంక్షేమం, అభ్యున్నతికి పాటుపడుతానని తెలిపారు. ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మరింత విసృతం చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. పార్లమెంటు పరిధిలోని సమస్యలపై నిరంతరం పాటుపడుతానని, ఈప్రాంత ప్రజలకు ఎయిమ్స్‌ను త్వరలో అందించేందుకు ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతానన్నారు.

ముస్లింలకు అత్యత పవిత్ర పండుగైన రంజాన్‌కు ఈద్గాల వద్ద అనువైన స్థల ఏర్పాటుకు చర్యలు చేపడుతానన్నారు. భువనగిరి ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, వైస్‌చైర్మన్‌ ఖాజా బషీరొద్దీన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నువ్వుల ప్రసన్న,డీసీసీ అధ్యక్షుడు కుంభం అనీల్‌కుమార్‌రెడ్డి, మైనార్టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షు డు యూసూఫ్‌బాబు, న్యూస్‌రీడర్‌ మహ్మద్‌ షరీఫ్‌, మాజీ చైర్మన్‌లు పెంట నర్సింహ్మ, బర్రె జహంగీర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, గోమారి సుధాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, బీసుకుంట్ల సత్యనారాయణ, తంగెళ్లపల్లి రవికుమార్‌, భట్టు రాంచంద్రయ్య, ఇబ్రహీం, ఎండీ ఇమ్రాన్‌, షరీఫ్‌, ముస్తాన్‌ జహంగీర్‌, బబ్లూ, ఎక్బాల్‌, కౌన్సిలర్‌ చోటేమియా, జలీల్‌, మాణిక్యమ్మ, అతికం లక్షినారాయణ, అబ్బగాని వెంకట్‌, కుక్కదూవు సోమయ్య, శంకర్‌బాబు, పిట్టల బాల్‌రాజ్‌, నక్కల చిరంజీవి, శ్రీధర్‌, కుశంగుల రాజు, ముస్లిం నాయకులు, అంజుమాన్‌ సొసైటీ సభ్యులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...